Friday, May 29, 2009

ఈ రోజు ...శనివారం. రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం అని అయితే ఏంటి అనకండి ఎందుకంటే శనివారం ఉదయం అంటే ఎందుకో మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది ఎన్నో పనులు చెయ్యాలనే పట్టుదల వుంటుంది. అందుకే పొద్దున్నే మొహం కడిగాను. విచిత్రంగా స్నానం చెయ్యాలనే కోరిక కలిగింది . ఇక్కడ విచిత్రం ఏమిటంటే శనివారం స్నానం చెయ్యడం నా ఇంట వంట లేదు. స్నానం అయ్యాక తౌవేల్అని అరిచాను. అరిచాక అర గంట కు రానో మా ఆవిడా ఈ రోజు వెంటనే దోగ్బ్రంతి తో పరిగెత్తి బాత్ రూం దగ్గరికి వచ్చింది. అర్రే మీరు స్నానం చేసారా.. అని నెలకొక సారి స్నానం చేసే వాడు స్నానం చేస్తునట్లు సంబర పది తోవేల్ మోహన్ పడేసి వల్లింది.

Monday, May 25, 2009

బరువు - బాధ్యత

అదొక వర్షం కురవని రాత్రి....టైం పదకొండో,పన్నెండో, ఒకటో, రెండో అయ్యింది. దూరంగా నక్కల ఊళలు ఏవీ వినపడక పోవటం తో నేను పడుకుని నిద్రపొయ్యాను....నా జీవితంలో మరచిపోలేని ఈ సంఘటన జరిగి ఇప్పటికి సరిగ్గా కొన్ని సంవత్సరాలా, కొన్ని నెలలయ్యింది.... ఒక రోజు....నేను ఆఫీసుకు బండిలో బయలుదేరుతుంటే రోడ్డు మీద స్కూలు బాగు తగిలించుకుని ఒక పిల్లవాడు లిఫ్ట్ అడుగుతున్నాడు...గోధుమ రంగు నిక్కరు, తెల్ల చొక్కా వేసుకునున్నాడు. చిన్మయా విద్యాలయా యూనిఫార్మ్...బండి ఆపాను..."ఎక్కడికి?" అడిగాను...."మీకు చిన్మయా స్కూల్ తెలుసా?" అడిగాడు...."ఆ తెలుసు" అన్నాను....."దాని దరిదాపుల్లో కాకుండా ఎక్కడైనా దూరంగా దించెయ్యండి" అన్నాడు..బెత్తం భయంతో బడి ఎగ్గొట్టి బయట తిరిగిన రోజుల్లో నాకు కూడా ఇలాంటి సహాయం బోలెడు మంది చేసారు..వీడిని కూడా నా మార్గంలొ నడిపిద్దామని బండి ఎక్కించుకున్నాను....పిల్లవాడు కదా అని బండి 40 లో పోనిస్తున్నాను..."బండి భలే తోలుతున్నారు..మీ పేరేంటి లావాటి అంకుల్?" అన్నాడు."లావాటి అంకులా???" వాడన్న మాటకి ఎవడో నా గుండెల్లో గాజు పెంకులు గుచ్చినంత బాధేసింది....నాకు కష్టం కలిగింది వాడు నన్ను 'అంకుల్ ' అన్నందుకు కాదు...ఆ పిలుపు నాకు అలవాటైపొయ్యింది (మన భారత దేశం లో ఇంటర్మీడియెట్ అయిపొతే మనకు వయసైపొయినట్టే....మన ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి పదో క్లాసు గాడిదలు కూడా 'అంకుల్ ' అని పిలుస్తారు)....వాడు నన్ను 'లావాటి ' అన్నాడే..అక్కడే కాలింది..ఇంతటి మాటన్నందుకు ఆ పిల్ల రాక్షసుడికి కోలుకోలేని శిక్ష వెయ్యాలని నిర్ణయించుకున్నాను....బండిని నేరుగా చిన్మయా విద్యాలయా ప్రిన్సిపల్ రూము ముందు ఆపాను...వాడన్న మాటలకు బాధ తట్టుకోలేక ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను....మా అన్నయ్యకు ఫోను చేసి "ఏరా...నేను లావుగా ఉన్నానా" అని నిలదీసాను....దానికి మా అన్నయ్య "ఈ మధ్య కాస్త లావయ్యావు కద రా..ఇప్పుడెందుకొచ్చింది ఆ అనుమానం?" అన్నాడు..."మరి ఇన్నాళ్ళూ చెప్పలేదే?" అడిగాను..."నేను చెప్పేదేంట్రా...నీ దగ్గర అద్దం లేదా?" అన్నాడు..."అది కూడా ఎప్పుడూ చెప్పలేదు రా......ఛ...సరే..నేను ఆత్మహత్య చేసుకోవాటానికి వెళ్తున్నాను..తరువాత ఫోన్ చేస్తా" అని పెట్టెయ్యబోయాను...దానికి మా వాడు "ఈ విషయానికి అంత బాధెందుకు రా...వెళ్ళి ఏదైనా మంచి జిం లో చేరు...వ్యాయామం చెయ్యి..మళ్ళీ మామూలుగా తయారౌతావు. ఈ సారైనా క్రమం తప్పకుండా రోజూ చెయ్యి...లేక పోతే జనాలు నిన్ను'బండంకుల్' అనో 'లావాటి అంకుల్ 'అనో అని పిలుస్తారు జాగ్రత్త " అని పెట్టేసాడు..నేను గతంలో కండలు పెంచటానికి చాలా సార్లు జిం లో చేరాను....హైవేల మీద స్పీడు బ్రేకర్ల లాగా ఇంతింత బొజ్జలేసుకున్న వాళ్ళు చాలామంది వస్తారు అక్కడకు....గోడలకు సిల్వెస్టర్ స్టాలన్, సంజై దత్ లాంటి హీరోల ఫొటొలు చాలా అతికించుంటాయి.....వీళ్ళతో పాటు జిం లో ఒక పెద్ద విలన్ కూడా ఉంటాడు....వాడి పేరు 'ట్రైనర్ '...బయట గ్రౌండులో పరిగెట్టిస్తే అట్నుంచి అటే ఇంటికి ఎక్కడ పారిపోతామో అని...జిం లో ట్రెడ్ మిల్ మీద పరిగెట్టిస్తాడు. నా వల్ల కాదు..ప్రాణభిక్ష పెట్టమని ఎంత అడుక్కున్నా చలించడు...నెలనెలా డబ్బు కట్టమంటే మొదటి నెల తరువాత ఎవ్వడూ కట్టడని.. మూడు నెలలకు కలిపి కట్టించుకుంటారు డబ్బులు. క్రితం సారి జిం లో చేరినప్పుడు నేను కూడా మూడు నెలల డబ్బు కట్టాను..కానీ వెళ్ళింది ఒకటిన్నర రోజులు . నేను చేరిన రెండవ రోజే ట్రైనర్ శెలవు పెట్టాడు...వాడి అసిస్టెంటు నాతో మిస్టర్ యూనివర్సు పోటీలకు తయారయ్యే వాళ్ళు చేసే ఎక్సర్సైసులన్నీ చేయించాడు...ఒక్కొక్కటీ మూడు సార్లు....."ఒళ్ళు హూనం" అంటారుగా...దానిని 10 తో గుణిస్తే ఎమంటారో అది అయ్యింది నాకు. ఆ రోజు రాత్రి నిద్ర పొయ్యి లేచాను...పైకి లేద్దామని చూస్తే నా వల్ల కాలేదు...చేతులకు, కాళ్ళకు బియ్యం బస్తాలు కట్టేసినట్టుంది...అటూ, ఇటూ ఒక్క అంగుళం కూడా కదలలేని పరిస్థితి.....అంతే..ఆ తరువాత నేను ఇంకో సారి జిం లో చేరలేదు... ఏమీ కష్టపడకుండా బరువు తగ్గే పధ్ధతి ఏదైన ఉందా అని నేను పరిశోధన చేస్తున్న సమయంలో దేవత లాగ కనిపించింది నా కొలీగ్ హేమలత...నా చెవిలో 'డైటింగ్, డైటింగ్, డైటింగ్' అని మంత్రోఛ్ఛారణ చేసింది..అంతే..ఒక వారం రోజుల పాటూ కడుపు ఎండగట్టాను...మూడు తలతిరగడాలు, ముప్పై మూడూ జ్వరాలతో డైటింగ్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న సమయంలో...మా ఇంటి దగ్గర మెరపకాయ బజ్జీలవాడు "End of season sale" పెట్టాడు....పది రూపాయలకు బజ్జీలు కొంటే రెండు రూపాయల బోండాలు ఫ్రీ...తేరగా బోండాలువస్తుంటే వదులుకునేంత రాతి హృదయం కాదు నాది. కట్ చేస్తే.. నడుము చుట్టూ ఒక అంగుళం పెరిగింది... ఆఫీసులో 7 వ అంతస్థు లో ఉంటుంది నా సీటు.....మెట్లెక్కితే మంచి ఎక్సరసైసు అని లిఫ్టు ఎంత ఆహ్వానిస్తున్నా రోజూ మెట్లెక్కే వెళ్ళేవాడిని. కాని ఒక రోజు మెట్లెక్కబోతుంటే....అక్కడ నుంచున్న సెక్యూరిటీ వాడు ఆపి "పొద్దున్నుండి మెట్లు పని చెయ్యట్లేదు సార్...ఇవ్వాళ లిఫ్ట్ లో వెళ్ళండి" అన్నాడు. అంతే...నడుము చుట్టూ ఇంకో ఇంచు.. ఇలా నాకు తెలియకుండా కొంచెం కొంచెంగా బరువు పెరుగుతూ పోతున్న సమయంలో న్యూస్ పేపర్ లో ఒక చిన్న ప్రకటన చూసాను..."అధిక బరువు మీ సమస్యా? అయితే ఈ నంబర్ కు ఫోను చెయ్యండి: 9845749659 - దినకర్"...అని ఉంది. నేను ఆ దినకర్ అనే మనిషి కి ఫోను చెయ్యంగానే 'నేనే మీ ఇంటికి వస్తాను సార్ ' అని అడ్రస్సు తీసుకున్నాడు..ఆ దేవదూత దినకర్ కోసం ఎదురుచూస్తూ గడియారం చూసాను..టైం 7:00 అయ్యింది. మంచినీళ్ళు తాగుదామని మంచం మీద నుంచి లేవబొయ్యాను...మెడ పట్టేసినట్టయ్యింది....అమ్మా...అస్సలు ఈ మెడ నొప్పంత దారుణంగా మనిషిని పీడించేది ఒకే ఒకటి - మెడ నొప్పి! దీనికి కారణమేంటో నాకు అర్థమయ్యింది...అందుకే ఆ రోజు నుంచి రాత్రి యేడింటికి నేను ఎప్పుడూ మంచినీళ్ళు తాగలేదు.7:15 కంతా దినకర్ మా ఇంటికి వచ్చాడు..చూడటానికి చాలా సన్నగా ఉన్నాడు..'ఆహా సరైన మనిషి చేతిలో పడ్డట్టున్నాను...నేను కూడ ఇంత సన్నగా అయిపోవచ్చూ అనుకుని.."రండి...ఏమి తీసుకుంటారు?" అని అడిగాను..."ఆల్రెడీ బయట మీ షూ పాలిష్ డబ్బా జేబులో వేసేసుకున్నాను..వేరే ఏమీ వద్దు " అన్నాడు...నేను నా సమస్య చెబుదామనుకునేలోపు మళ్ళీ తనే మాట్లాడుతూ " సార్...నేను చిన్నప్పటి నుండి చాలా సన్నగా ఉన్నాను...ఎంత ప్రయత్నించినా లావు కావట్లేదు..మీ లాంటి వాళ్ళను కలిస్తే కొవ్వు ఎలా పెంచుకోవాలో చెబుతారని ఆ ప్రకటన ఇచ్చాను...ఇప్పుడు చెప్పండి...మీ అధిక బరువు రహస్యమేంటి?" అన్నాడు....తినటానికి తిండి లేదని ఒకడేడుస్తుంటే మందులోకి సైడ్ డిష్ అడిగాడంట వెనకటికి ఒక దినకర్......నా కంట్లో నీళ్ళు చూసి వాడికి పరిస్థితి అర్థమయ్యి వెళ్ళిపొయ్యాడు. ఆ వెళ్ళేవాడు ఊరికే పోకుండా.. బరువు తగ్గటానికి నాకు జిం వాళ్ళు ఇచ్చిన పొడి,గూట్లో పెట్టున్నది, తస్కరించుకుని మరీ వెళ్ళాడు. తరువాత తెలిసింది నాకు....దానిని కంది పొడి లాంటిదే అనుకుని, నెయ్యి వేసుకుని అన్నంలోకి కలుపుకుని తిన్నాడంట...ఎలక లా ఉండేవాడు బొద్దింక లాగా తయారయ్యాడు......ఇలాంటి తరుణంలో నేను, నా అధిక బరువు కలిసి ఒక సారి TV చూస్తుండగా టెలీ షాపింగ్ నెట్వర్క్ వాళ్ళ అడ్వర్టైస్మెంటు ఒకటి వచ్చింది..'Fit, Fitter, Fittest' అనే పరికరం గురించిన ప్రకటన అది..ఆ అడ్వర్టైస్మెంటులో అమ్మాయిలు, అబ్బాయిలు ఆనందంగా నవ్వుతూ ఎక్సర్సైసులు చేస్తున్నారు...వాళ్ళందరిలోకీ ఎక్కువగా నవ్వుతున్నవాడు "మా ఈ 'Fit, Fitter, Fittest' తో వ్యాయామం చెయ్యండి...రోజుకు 10 నిముషాలు చాలు...మీ శరీరం లో ఉండే కొవ్వు అంతా కరిగి పోతుంది...కాళ్ళూ చేతులు బలంగా తయారౌతాయి...కండలు తిరుగుతాయి....పళ్ళు మిలమిలా మెరుస్తాయి..జుట్టు నిగనిగలాడుతుంది..చొక్కా తళతళ మెరిసిపోతుంది " అన్నాడు..ఇంతటి గొప్ప పరికరాన్ని పెట్టుకుని నేను అనవసరంగా కష్టపడుతున్నా...పైగా దీనితో బోలెడన్ని లాభాలు (పళ్ళు, జుట్టూ, చొక్కా)....వెంటనే ఆ పరికరం ఆర్డర్ చేసేసాను..1000 రూపాయలయ్యింది. దానిని ఇంటికి తెచ్చిన వాడు కూడా నవ్వుతూ ఇచ్చాడు...ఎంత మంచి మనుషులు వీళ్ళంతా.....ఆలస్యం చెయ్యకుండా 'Fit, Fitter, Fittest' కవర్ తీసేసి, దాని మీద కూర్చుని, TV లో చూపించినట్టుగా నవ్వుతూ ఎక్సర్సైసు చెయ్యటానికి ప్రయత్నించా...అది ఎటూ కదలటం లేదు...ఒక అర గంట పాటు దానిని అన్ని వైపుల నుంచి కదల్చటానికి ప్రయత్నించా...దానికున్న పిడికి తగులుకుని నా షర్టు చిరిగాక వదిలేసా...అప్పుడర్థమయ్యింది..ఆ అడ్వర్టైస్మెంటు వాళ్ళూ, ఆ డెలివరీకి వచ్చిన వాడు ఎందుకు నవ్వుతూ కనిపించారో....అంత డబ్బు పోసి దీనిని కొనే నాలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే ఇక నవ్వక ఏంచేస్తారు? చెయ్యగలిగింది ఏమీ లేక ఆ పరికరం పేరు కొంచంగా మార్చి ('i' లు ఉన్న చోటంతా 'a' లు చేర్చాను) లావు కావటానికి తపించిపోతున్న దినకర్ కు 5000 రూపాయలకు అమ్మేసాను...పోనీ ఏవైన పుస్తకాల్లో లావు తగ్గటానికి మార్గాలుంటాయేమోనని నాలుగైదు పుస్తకాలు కొని చదివా...మంచి 10, 15 కిటుకులిచ్చి, చివరకు "మీరు ఇవన్నీ క్రమశిక్షణ, పట్టుదల తో చేస్తే తప్పకుండా చక్కటి,నాజూకైన శరీరం మీ సొంతమవుతుంది " అని రాస్తారు....అసలు ఆ క్రమశిక్షణ, పట్టుదలే ఏడ్చుంటే ఇలాంటి పుస్తాకాలు ఎందుకు కొంటాను?? అవి లేని వాళ్ళకోసం ఏవన్నా చిట్కాలుంటాయనే కదా ఈ తనకలాట... కాస్త పెద్దవాళ్ళకెవరికైన నా బాధలు చెప్పుకుంటే "ఇప్పుడు ఉద్యోగాలలో పొద్దున్నుంచి కుర్చీలో కూర్చొనే ఉండాలి...అందుకే అలా లావుగా ఔతున్నారు " అంటారు...నాకర్థం కాదు,..ఇదివరకు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఆఫీసులో గంటకొకసారి కబడ్డీ ఆడేవాళ్ళా ఏంటీ??అయినా ఈ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేసాడనే చెప్పుకోవాలి..నాకు తెలిసిన కొంతమంది ఎంత తిన్నా, వ్యాయామం చెయ్యకపొయ్యినా లావు పెరగరు...మరి నేను ...గట్టిగా గాలి పీల్చినా రెండు కిలోలు బరువు పెరుగుతాను..ఇవ్వాళ తెల్లవారుజామున గేటు చప్పుడైతే ఎవరబ్బా అని కిటికీలోంచి చూసా...సుచరిత గారు...మా ఎదురింట్లోనే ఉంటుంది...చిన్నప్పటి నుంచి నన్ను 'తమ్ముడూ...తమ్ముడూ ' అని ఎంతో ప్రేమతో పలకరించేది ఎప్పుడూ....తలుపు తీసి "రండి ఆంటీ" అన్నాను. దానికి ఆవిడ "లావాటి అన్నయ్య గారూ....కొంచం పంచదార వుంటే ఇస్తారా...మీ బావగారికి జిం కు ఆలస్యమౌతొంది " అంది..ఈ సూటిపోటి మాటల బరువు నేను మొయ్యలేను..ఇంకో మూడు నెలల్లో నేను బరువు తగ్గుతాను.....ఒక వేళ తగ్గకపోతే....దానికి నైతిక బాధ్యత వహించి మన రాష్ట్రపతి రాజీనామా చెయ్యాలి!

Why mother is so special

Why mother is so special:

When I came home in the rain,

Brother asked why didn’t you take an umbrella.

Sister advised, Why didn't you wait till rain stopped.

Father angrily warned, only after getting cold, you will realize.

But Mother, while drying my hair, said, stupid rain! Couldn't
it wait, till my child came home?

That Is MOM !
మిత్ర ఖేదం

సూర్యుడికి మేఘంలాగా, అగ్నికి నీరులాగా, పువ్వుకు తుమ్మెదలాగా,గౌతం పాలిటి నరేంద్ర లాగా మనకు మన జీవితాల్లో కొంతమంది స్నేహితులు తగులుతూనే ఉంటారు. అప్పుడప్పుడూ మనమూ వాళ్ళ పాలిట నరేంద్ర గా మారుతుంటాము.గుండ్రాలు....గుండ్రాలు...గుండ్రాలు...ఫార్మసి కు ముందు, ఎమ్ సెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రోజులు. ఫలితాలు రానే వచ్చాయ్. నాకూ, నా పాలిట దినకర్ అయిన అనంత్ కూ, మరో ఇద్దరు మిత్రులకూ రాంకు వచ్చింది! సృష్టిలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతాయ్ అన్నది అర్థం అయింది. (ఎమ్సెట్ రాని మిత్రుల లిస్టు పెద్దది కాబట్టి ఇక్కడ చెప్పడం కుదరదు)ఎమ్సెట్ కొట్టామన్న ఆనందాన్ని మా నలుగురు, ఎమ్సెట్ తమను కొట్టిందన్న ఆక్రోశాన్ని మిగిలిన మిత్రులు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. అందులో భాగంగా జీవితంలో మొట్ట మొదటి సారి ఓ "మంచి" మళయాళ చిత్ర రాజాన్ని చూడాలని నా మిత్ర బృందం నిర్ణయించింది. ఆ చిత్రం పేరు "అడవిలో అందగత్తెలు".అందరూ మా ఇంటికి వచ్చేరు. మాది చాలా ఆర్తోడాక్స్ ఫ్యామిలీ!"ఇలాంటి సినిమాలు చూస్తే చెడిపోతాం. అంత కక్కుర్తి తో ఈ సినిమా చూడ్డం నాకు ఇష్టం లేదు. నేను రాను"ఉద్రేకంగా చెప్పాన్నేను.ఓ ముప్పావు గంట తర్వాత సినిమా హాలు దగ్గరున్నాము.అది మా వూళ్ళోని ఓ poorman's multiplex. అందులో 3 సినిమా హాళ్ళు. అందులో ఒక సినిమా హాల్లో శరత్ బాబు ప్రధాన పాత్రధారుడిగా "అయ్యప్ప స్వామి లీలలు" సినిమా ఆడుతోంది. ఆ పక్క సినిమా హాల్లో మేము వెళ్ళదలుచుకున్న సినిమా. రెండు సినిమా ల టికెట్ కవుంటర్లు, థియేటర్ తలుపుకి చెరో వైపున ఉన్నాయ్. అయ్యప్ప సినిమా కు విపరీతమయిన రద్దీ. టికెట్లు ఇవ్వడం ఇంకా ఆరంభించలేదు. సరే అని బఠాణీలు, శనక్కాయలు షాపింగ్ చేయడానికని హాలు బయటికెళ్ళాం మేము. అక్కడ కాస్త నింపాదిగా కూర్చుని ఉన్నాం. ఇంతలో టికెట్ కవుంటరు ముందు లైటు వెలిగింది.అంతే! అయ్యప్ప స్వామి లీలలు సినిమా కోసం కాచుకున్న జనాభా అంతా మూకుమ్మడిగా రెండవ సినిమా హాలు టికెట్ కవుంటర్ వైపు పరిగెత్తుకు రాసాగారు. మేము త్వరగా స్పందించి, కవుంటర్ వైపు పరిగెట్టాము. ఎలాగోలా మా బృందం అందరం క్యూలో నిలబడి టికెట్లు తీసుకున్నాం. మా మిత్ర బృందంలో అనంత్ (దినకర్) మాత్రం లేడు!బాక్ గ్రవుండ్ లో జరిగిందిదీ! మేము శనక్కాయలు తింటుండగా, మా వాడు అయ్యప్ప స్వామి సినిమా క్యూలో వాళ్ళ అక్కయ్య ఫ్రెండ్ నిలబడి ఉండటం చూసాడు. మాతో "ఇప్పుడే వస్తా" అని చెప్పి పక్కకెళ్ళాడు. నేనూ నా మిత్ర బృందంతో కలిసి పరుగులు తీస్తున్నప్పుడు వాడి అక్కయ్య ఫ్రెండ్ నన్ను చూసింది! (ఆమె ఇల్లు మా వాడి ఇంటి పక్కనే. నేను వాడి ఇంటికి అప్పుడప్పుడూ వెళుతుంటా కాబట్టి, నన్ను ఆమె గుర్తు పట్టింది). వాడు మాత్రం ఆమె కనుమరుగయే వరకు ఎదురు చూసి, తర్వాత మా దగ్గరకు వచ్చాడు.సినిమా అంతా భయంకరమైన సస్పెన్స్త్ తో , ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలమధ్య, అడవిలో ఉత్కంఠ భరితంగా గడిచింది.ఆ సినిమా కు సెన్సార్ సర్టిఫికట్ ఇచ్చిన వాడికి ఇంగ్లీష్ అక్షరాలు సరిగా రానట్లుంది. "U" అని రాయాల్సిన చోట "A" అని రాసాడు.మరుసటి రోజు వాడి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అక్క నా వైపు కొంచెం నిరసనగా, అనుమానంగా చూసింది. ఆ పయోముఖ సారా కుంభం గాడు అప్పటికే తప్పును నా మీదకు మళ్ళించి ఉన్నాడు. నాకు కొంచెంగా అర్థమయింది విషయం. ఎందుకంటే, మొట్ట మొదటి సారి జీవితం లో (so called) తప్పు చేసేం. ఎవరు అనుమానించినా అందుకేనేమో అని మనసులో ఓ అభద్రతా భావం. ఆవిడ అడగనే అడిగింది నన్ను,వాణ్ణి కలిపి, "ఏరా, ఇంజినీరింగు సీటు వస్తూనే కొమ్ములొచ్చాయా? వెధవ పనులు, మీరూను" అంటూ. (నిజానికి వాళ్ళింట్లో అందరికీ, నామీద మంచి నమ్మకం, రవి మంచి బాలుడు అని.)వాడు చెప్పక ముందే నేను చెప్పేను, "లేదక్కా, అయ్యప్ప సినిమాకని వెళ్ళాము. అక్కడ క్యూలో అందరు ఇంకో సినిమా వైపు పరిగెత్తుతుంటే, మేము పరుగెత్తి టికెట్లు కొన్నాం అంతే, హాలు లోపల చూస్తే, ఈ దరిద్రం సినిమా ఉండె. మాకసలు తెలీనే తెలీదు."ఆమె నా మాట నమ్మినట్టే కనబడింది. (నా లాంటి అమాయకుడు అలాంటి తప్పులు చేయడని ఆమె గట్టి నమ్మకం కాబట్టి.)అంతా అయ్యప్ప లీల!!!*********************************వాణ్ణి దెబ్బ కొట్టే అవకాశం మరో సంవత్సరం తర్వాత నాకు వచ్చింది. ఇంజినీరింగు మొదటి యేడు అచ్చు "హాపీ డేస్" సినిమాలోలా గడిపేం. ఆ యేడు గడవగానే, నాకు రొస్టు సివిల్ ఇంజినీరింగు నుండీ తొట్టి మెకానికల్ కు, వాడికి రొస్టు సివిల్ నుండీ తోలు కెమికల్ కు ప్రమోషన్లు లభించాయ్. రెండవ ఏడు మా ఇద్దరికీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ కామను. మా ఇద్దరికీ నచ్చని ఒకే ఒక సబ్జెక్ట్ అది.ఆఖరు ఇంటర్నల్ పరీక్షలు వచ్చాయ్. మామూలుగానే పరీక్షలను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఆ సమయంలో, నాకు (అవుట్ అయిన) ప్రశ్నాపత్రం ఓ మిత్రుడి ద్వారా దొరికింది. అప్పుడు...నాకో అద్భుతమైన అవుడియా వచ్చింది. ఎలాగు ప్రశ్నాపత్రం అందరికీ దొరుకుతుంది. అంతలోనే మా వాణ్ణి ఓ చిన్న ఆటాడించాలి! వెంటనే ఆ ప్రశ్నా పత్రానికి ఇంకో ఇంకో 5,6 ప్రశ్నలు (కొన్నిటికి తప్పుడు సమాధానాలు) కలిపి, తన వద్దకు వెళ్ళాను. "రేయ్, రేపు జరుగబోయే పరీక్ష ప్రశ్నాపత్రం ఇది. ఏం చేస్తావో తెలీదు. మనం సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ ఆన్సర్లు పట్టాలి. రాత్రిలోగా ప్రిపేర్ అవాలి" చెప్పాను.ఆ రోజు రాత్రికి వాడో పేపర్ తీసుకొచ్చాడు. (బాక్ గ్రవుండ్ లో...వాడూ నన్ను దెబ్బ కొట్టాలని, కొన్ని తప్పుడు సమాధానాలు రాసుకుని తీసుకొచ్చేడు) సరే ఎలాగో మొత్తం ప్రిపేర్ అయాం. తర్వాతి పరీక్షలో ఇద్దరం ఫెయిలు!ఆ ర్వాత ఫైనల్ పరీక్షలోనూ విజయ వంతంగా ఫెయిలయాం ఇద్దరూనూ. ఇక్కడో విషయం. అప్పట్లో మా యూనివర్సిటీ JNTU లో కొన్ని (3,4) సబ్జెక్ట్లు వదులుకున్నా డిగ్రీ రావడానికి ఢోకా ఉండదు. క్రెడిట్ సిస్టం అంటారు దాన్ని. అందువల్ల మాకు ఇబ్బంది లేదు. అయితే ఇంటి దగ్గర ఊరుకోరు కదా. మా నాన్నకేమో వాడి మీద, వాడి నాన్న కేమో నా మీద నమ్మకం. ఇద్దరం ఫెయిలయ్యాం అన్న విషయం ఎలాగో ఇంట తెలిసింది. మేమిద్దరం మాట్లాడుకుని ఓ ప్లాను వేసుకున్నాం. వాళ్ళ నాన్నను నేను, మా నాన్న ను వాడు కన్విన్స్ చేసేట్టుగా.అందులో భాగంగా ,అంకుల్ నా దగ్గరకు రాగానే నేను చెప్పాను. "అంకుల్, మా యూనివర్సిటీ పద్దతి చాలా ఆధునికంగా ఉంటుంది. విద్యార్థికి తనకు నచ్చిన సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగించడం వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం. అందుకనే ఒకట్రెండు పరీక్షలలో ఫెయిలయినా పట్టించుకోదు. నిజానికి ఫెయిలవాలి కూడా. అలా కాకపోతే, వాళ్ళు మా మీద చర్య కూడా తీసుకుంటారు.""ఇదేం యూనివర్సిటీ రా, పరీక్షల్లో ఫెయిలవమని చెబుతుంది. ఎక్కడా విన్లే" అన్నాడాయన."అదే అంకుల్, మా యూనివర్సిటీ గొప్పతనం. అందుకే ఇందులో సీటు రావడం చాలా కష్టం" చెప్పాను నేను.మా నాన్న వాడి దగ్గరకెళ్ళాడు అనుకున్నట్టుగానే. వాడు అదో గొప్ప విషయంలా మా నాన్నకు సర్ది చెప్పేడు.శుభం. ఆ తర్వాత ఎప్పుడైనా వాడు నా మీద, నేను వాడి మీదా కత్తులు నూరాలని ప్రయత్నించినా ఇద్దరికీ చెడుపు చేస్తుండటంతో, అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తనెక్కడో, ఏ దేశానికి పారిపొయాడో తెలీదు!
Posted at 10:52AM Nov 10, 2008 by Shashidhar Bussa in General Comments[0]
-->
Thursday Nov 06, 2008

సాపాటు ఎటూ లేదు....
మా ఊరు తిరుపతి. యాస లో చెప్పాలంటే..."యోవ్..మాది తిరపతి యా". మద్రాసు నుండి వారవారం ఇంటికి వెళ్తుంటాను. ప్రతీసారిలా కాకుండా, మొన్న శనివారం కాస్త త్వరగా లేచి బయలుదేరాను.ఉరుకులు పరుగుల మీద బస్టాండు చేరుకున్నా. పర్సు లొ ఇరవై రూపాయలే ఉన్నాయి. బస్టాండులో ఉన్న ATM లో ఐదు వందలు తీసాను. వందల నోట్లు లేవనుకుంటా. ఒక ఐదు వందల నోటు వచ్చింది..తీసుకుని తిరుపతి ప్లాట్ఫారం దగ్గరకు వెళ్ళాను. తిరుపతి బస్సు కనపడగానే ముందూ వెనకా ఆలోచించకుండా ఎక్కేసాను. లోపల బోలెడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు.డ్రైవర్ ను అడిగాను "ఇది తిరుపతి బస్సే కదండీ"..డ్రైవర్ - "ఔను సార్...కూర్చోపొండి" అన్నాడు. ఆనందం పట్టలేక, ఒక సీట్లో బాగు పడేసి మాగజీనేదైన కొందామని కిందకు దిగాను.పుర్సులో ఒక ఐదువందల నోటు కాకుండా ఇంకొ ఇరవై రూపాయలు ఉంది. రెండు న్యూస్ పేపర్లు తీసుకున్నను. "చిప్స్ కావాల సార్" అని ఆ కొట్టోడు అడిగాడు. వొద్దని ఒక సినిమా పత్రిక కొని, వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను.గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలొ మనిషి గా పుడతారంట - ఇందులో ఎంత నిజముందో నాకు తెలియదు.వరుసగా గత పది జన్మలలో విపరీతమైన పుణ్యం చేసుకుంటే మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే బస్సులో కిటికీ పక్కన సీటు దొరుకుంది - ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.ఆకలి గా ఉంది..మళ్ళీ కిందకు దిగి ఎమైన కొనుక్కొద్దామా అనుకునేంతలో రెండు అరవ బాచీలు బస్సు ఎక్కాయి. మద్రాసు లో జనాలు మామూలుగ కలసి మెలసి ఉంటారో లేదో తెలియదు కానీ, తిరుపతికి బయలుదెరేటప్పుడు మాత్రం కాలనీలు కాలనీలు కలిసి బస్సెక్కుతారు. ఇప్పుడు కిందకు దిగితే చచ్చానే..ఇక్కడ "ఈ సీటు నాది" అనటానికి కర్చీఫులు, బాగులు పెడితే, వాటితో సీటు తుడుచుకుని కూర్చుంటారు.మన చెయ్యో,కాలో కోసి పెడితే తప్ప మన సీటు సేఫ్ కాదు. వెధవ రిస్కు ఎందుకు..ఇంకొ గంటన్నర లో ఎలాగూ 'హోటల్ కాశీ' దగ్గర బస్సాపుతాడు.అక్కడ దిగి కావలసింది తినొచ్చు.సీటు నుంచి మాత్రం లేచేది లేదు.బస్సు నిండింది. డ్రైవర్ పోనిచ్చాడు. ఇక్కడి బస్సులకు రెండే గేర్లు ఉంటాయి - న్యూట్రల్, నాలుగో గేరు. బండి న్యూట్రల్ లొ లేదూ అంటే మేఘాల్లో తేలిపోతూ ఉంటుంది..అందుకే ఇక్కడ బస్టాండు లోపల కూడా ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి.కండక్టరు వచ్చాడు..ఐదు వందలు నోటిచ్చాను..టికెటిచ్చి "చిల్లర తరువాత తీసుకో" అన్నాడు.బస్సు కదిలిన ఐదు నిముషాలకు అరవ బాచి నెంబర్ 1 వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద బాగు లోంచి పదిహేను పులొహోర పొట్లాలు తెరిచి, వాళ్ళ మూకకు సరఫరా చెసారు. నా ఆకలి రెండింతలయ్యింది. బస్సాపినప్పుడు నేను కూడా పులిహోర తిందామనుకున్నను - మూడు ప్లేట్లు.మద్రాసు బస్సుల్తో ఇంకో చిక్కేంటంటే - దారిపొడుగునా జనాలను ఎక్కిస్తూనే ఉంటారు. తిరుపతి చెరేటప్పటికి ఒక బస్సులోంచి శ్రీలంక జనాభా అంత మంది దిగుతారు.మద్రాసు దాటుతున్నామనగా ఎవరొ ఒకావిడ, ముగ్గురు పిల్లలు ఎక్కారు. వాళ్ళలో ఒక పిల్లాడిని నా దగ్గరకు పంపుతూ "కూర్చో రా..మావయ్య ఎమీ అనుకోడు" అంది. ఒక్క దెబ్బకు రెండూ పిట్టలు కొట్టింది ఆంటీ!మొదటి పిట్ట - "మావయ్య" అన్న మాట వల్ల నేను ఆవిడ వైపు వంకరగ చూడలేనురెండో పిట్ట - బంధుత్వం కలిపింది కాబట్టీ ఆ పిల్లోడు నా ఒళ్ళో, నెత్తి మీద..ఎక్కడైన కూర్చోవచ్చు. నా ఆకలి తీవ్ర స్థాయికి చెరుకుంది. ఎప్పుడు 'హోటల్ కాశి ' చేరుకుంటామ అని ఎదురుచూస్తున్నా.పావు గంట తరువాత అరవ బాచి నెంబర్ 2 పులిహోర పొట్లాలు తెరిచారు. వార్నీ..బట్టలకు ఒక బాగు, పులిహోర పొట్లాలకు నాలుగు బాగులు తెచ్చుకున్నారు వీళ్ళూ. వీళ్ళు తిని ఊరుకుంటే పరవాలేదు..నా వెనక కూర్చున్నోడు నా ముందు కూర్చున్న వాడికి నన్ను పొట్లం అందించమంటాడు. ఆ చివ్వర ఉన్నోడెవడొ "పులిహోర భలేగుంది" అని అందరికి వినిపించేట్టు అరుస్తాడు..నా ఆకలి నిముష నిముషానికి పెరుగుతోంది. అన్ని పొట్లాలు అందించాను..మాట వరసకైన "మీరూ కాస్త రుచి చూడండి" అని అనలేదు..ముష్టి వెధవలు.ఆకలిని, బాధని దిగమింగుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు..ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు. కళ్ళు తెరిచి చూస్తే.."హోటల్ కాశి" అని కనపడింది. ప్రాణం లేచొచ్చింది. బస్సు కిటికీలొంచి అలాగే కిందకు దూకేసాను. "మూడు ప్లేట్ పులిహోర" అని అరవబొయ్యి ఆగాను...నా పర్సులో డబ్బు లేదు..కండక్టరు గాడు చిల్లర ఇవ్వలా. ఉన్న ఇరవై రూపాయలు మద్రాసు బస్టాండు లొ ఊదేసాను. చుట్టూ చూసాను..కండక్టరు కనిపించలా. అటూ ఇటూ తెగ వెతికాను. ఎక్కడా లేడు.ఈ హోటలు వాడా కార్డులు తీసుకోడు..ఒ నెల క్రితం వీడి దగ్గర తిన్నప్పుడు credit card ఇస్తే..దాని బరువు చూసి "దీనికి పావల కన్నా ఎక్కువ రాదు సార్" అన్నాడు.మా బస్సు హార్ను వినిపించింది. అందరు ఎక్కి కూర్చున్నారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కాను. బస్సు కదిలింది. కండక్టరు గాడి దగ్గరకు వెళ్ళి నా చిల్లర అడిగాను..వాడి బాగు చూపించి "అందరూ 500, 1000 నోట్లు ఇస్తే నేను మాత్రం చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేది సార్? తిరుపతి బస్టాండు లొ దిగాక అక్కడ చిల్లర చేసి అందరికీ ఇస్తాను" అన్నాడు.చేసేదేమీ లేక వెళ్ళి నా సీట్లొ కూర్చున్నాను. డ్రైవర్ మళ్ళీ పాటలు పెట్టాడు.పెళ్ళిపుస్తకం లో వన భోజనం పాట.."పప్పప్పప్పప్పప్పు దప్పళం...అన్నం..నెయ్యి..వేడి అన్నం కాచిన్నెయ్యి....వేడి వేడి అన్నం మీద...కమ్మని పప్పు కాచిన్నెయ్యి"ఏంటిది..అందరూ కలిసి నా మీద దండ యాత్ర చేస్తున్నారు...ఇంకే పాటా దొరకలేదా వీడికి..ఒక వైపు ఆకలి తొ నా ప్రాణం పోతుంటే..నెయ్యి, పప్పు, ఆవకాయ..."ఆకలి" నుంచి "ఆఆఆఅకలి" స్థితికి చేరుకున్నాను.ఎన్ని గంటల తరువాత తిరుపతి చేరుకున్నానో తెలియదు..బస్సు దిగంగానె కండక్టరు గాడితో చిల్లర తీసుకున్నాను. ఇంటికి వెళ్ళే వరకు ఆగే ఓపిక లేదు. బస్టాండు కాంటీన్ కు వెళ్ళి ఒక పులిహోర ఆర్డర్ చేసాను..వాడు ఫ్రెష్ గా మూడు రోజుల క్రితం పులిహోర తెచ్చిపెట్టాడు....ఎంత కమ్మగా ఉంది!!
Posted at 09:15AM Nov 06, 2008 by Shashidhar Bussa in General Comments[1]
-->
Wednesday Nov 05, 2008

ఓణం - ఆణో - పెణ్ కుట్టి
ఓ నెల రోజుల క్రితం మాట...మా వదిన షాపింగు చెయ్యాలంటే తోడు వెళ్ళాను. తన దగ్గరున్న 1,487 జతల చెప్పులు పాతవయ్యాయని కొత్త చెప్పులు కొనటానికి 'మెట్రో షూ మార్టు ' కు వెళ్ళాము. మూడు గంటల తరువాత తను కొన్న చెప్పులకు బిల్లు కట్టటానికి పర్సులో ఉన్న డబ్బు, కారు తాళాలు, ఇంటి కాగితాలు షాపు వాడికి ఇస్తుండగా ఎవరో ఒకమ్మాయి వచ్చి మా వదినను పలకరించింది..ఓ ఐదు నిముషాల పాటు మాట్లాడుకున్నారు..దూరంగా కూర్చున్న నన్ను చూపించింది మా వదిన..ఈ చెప్పుల కొట్టోడికి నన్ను తాకట్టు పెట్టేస్తొందేమోనని కంగారు కంగారు గా పరిగెట్టుకెళ్ళాను..."ఈ సారికి మా వాడు వస్తాడు...ఇదిగో..మాటల్లోనే వచ్చాడు....ఈ అమ్మాయి నా ఫ్రెండు శిల్ప చెల్లెలు - పూర్ణిమ...వీడు నా మరిది - గౌతం" అని పరిచయం చేసింది..."మీరు తప్పకుండా రావాలి...అడ్రసు మీ వదినకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి..మా వదిన నా వైపు తిరిగి "ఈ 12 వ తారీఖు వాళ్ళింట్లో ఒక ఫంక్షన్ ఉంది...నేను, మీ అన్నయ్య ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి నిన్ను పంపిస్తానని మాటిచ్చాను" అంది.."నేనెళ్ళను..ఆ రోజు నాకు ఆఫీసు లో మూడు మీటింగ్లున్నాయి, మొబైలు బిల్లు కట్టాలి, బ్యాంకు లో పనుంది, ఫ్రెండ్స్ తో సినిమా ప్లానుంది, డిన్నర్....""అది 'ఓణం' ఫంక్షన్...పెళ్ళి కాని మళయాళీ అమ్మాయిలు బోలెడు మంది వస్తారు""ఆ కవర్లు ఇటీ వదినా...ఎన్నింటికెళ్ళాలి?"*******************************************నాకు మళయాళంలో అత్యంత ఇష్టమైన పదాలు మూడున్నాయి - ఓణం, ఆణో, పెణ్ కుట్టి...'పెణ్ కుట్టి ' అంటే 'అమ్మాయి ' అని అర్థం..ఆ భాష లో ఇంతకన్నా అందమైన పదం ఉండటం అసాధ్యమని నా లిస్టు అక్కడితో ఆపేసాను..మళయాళీలను 'మల్లు'లు అంటారని అందరికీ తెలుసు..కానీ మళయాళీ అమ్మాయిలను 'మల్లమ్మ'లు అంటారని కొందరికి మాత్రమే తెలుసు..(మల్లమ్మ = మల్లు + అమ్మాయి - షష్టీ తత్ 'పురుష' సంధి)..పూర్ణిమ వాళ్ళ ఇల్లు ఇందిరా నగర్ లో - విజయనగర్ నుండి 15 కిలోమీటర్లు. త్వరగా బయలుదేరాలని ఉదయాన్నే, తెల్లవారుజామునే, మరియు పొద్దున్నే లేచాను..వెళ్తున్నది 'ఓణం' ఫంక్షన్ కు కాబట్టి..మళయాళీల సంప్రదాయ లుంగి, చొక్కా వేసుకుని, Asianet చానెల్ లో యేసుదాస్ సుప్రభాతం విని, అయ్యప్ప స్వామికి మొక్కుకుని, కొబ్బరి నూనె తో చేసిన ఇడ్లీలు తిని, పడవలో బయలుదేరాను..నీల్ విజయ్ గాడి ఫోను వచ్చింది - "జై ఓణం...చెప్పరా""ఏరా..ఓణం ఫంక్షన్ కు వెళ్తున్నావంట...మీ అన్నయ్య చెప్పాడు. నేనొక్కడే వెళ్తానంటే నా వైఫ్ ఒప్పుకోదు..మా ఇంటికి రారా..ఇద్దరూ కలిసి వెళ్దాం..అసలే మల్లమ్మలు.. ""నోరు మూసుకుని ఇంట్లో కూర్చోరా...చూసావా..పెళ్ళి చేసుకోకపోవటం వల్ల ఉన్న లాభాలు....ఉహుహుహహహ" అని వికటాట్టహాసించాను (వికటాట్టహాసం = వికట + అట్టహాసం - 'హాసం'-పత్రిక-నిలిచిపోయింది సంధి)...మరో అరగంటలో పూర్ణిమ వాళ్ళ ఇల్లు చేరాను..వాళ్ళ ఇంటి వెనకాల నా పడవ పార్కు చేస్తుండగా నా పక్కన ఒక TVS-50 వచ్చి ఆగింది.."హమ్మయ్య..సరిగ్గా టైముకు వచ్చాను " అన్న మాటలు వినిపించాయి...ఇక్కడ తెలుగు మాట్లాదేది ఎవర్రా అని పక్కకు చూసాను....దినకర్ గాడు...."రేయ్...నువ్వేమి చెస్తున్నావిక్కడ???" అనడిగాను"నువ్విక్కడ జరిగే ఓణం సంబరాలకు వస్తున్నావని ఇందాకే నాకొక ఆకాశరామన్న sms వచ్చింది......అయినా ఇది చాలా అన్యాయం రా..సంవత్సరానికి 9 సార్లు నాతో బర్త్ డే పార్టీలు తీసుకోవటానికి మాత్రం ఫోన్లు చేస్తుంటావే.....ఇంతమంది మల్లమ్మలను కలిసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చెయ్యవేరా??" అన్నాడు తన TVS-50 ని చెట్టుకి కట్టేస్తూ....ఇంతలో నాకొక sms వచ్చింది..నీల్ విజయ్ గాడి దగ్గరి నుండి.."ఉహుహుహహహ - ఇట్లు ఆకాశరామన్న" అని ఉంది..దినకర్ గాడికి ఆ SMS చూపించాను.."వార్నీ...నీకు కూడా నీల్ విజయ్ గాడి మొబైల్ నుండే వచ్చిందా??...ఈ ఆకాశరామన్న గాడెవడో నీల్ గాడి మొబైల్ నుండి అందరికీ మెసేజ్ లు చేస్తున్నాడు రా....వెంటనే నీల్ గాడికి ఫోను చేసి చెప్పాలి..." అని నా డ్రస్సు వైపు వింతగా చూసాడు.."మల్లూల సంప్రదాయ దుస్తులు రా...ఓణం కదా అని" అన్నాను.."ఇలా లుంగీలు, గోచీలు కట్టుకొస్తే అమ్మాయిలు నీ దగ్గరకు కూడా రారు... నాతో ముందే చెప్పుంటే నాలాగ 'hep' గా డ్రెస్ చేయించుండేవాడిని కదరా " అంటూ తన డ్రస్సు చూపించాడు......గులాబి రంగు జీన్సు ప్యాంటు ....టీషర్టు మీద 'Cool Dude' అని రాసుంది........తలకు నవరత్న తైలం రాసుకుని, నుదుటికి వీబూది అడ్డబొట్టు పెట్టుకున్నాడు......చిన్నగా నవ్వి ప్యాంటు కాస్త పైకి లేపాడు...కుడికాలికి ఎరుపు, ఎడమ కాలికి నీలం రంగు సాక్సులు వేసుకునున్నాడు...."ఆ సాక్సులేంట్రా" అన్నాను.."చూసావా..అమ్మాయిలు కూడా నా సాక్సులు చూడగానే ఇలానే అడుగుతారు..నేను వెంటనే వాళ్ళ పేరు, ఫోన్ నంబరు తీసుకుంటాను...గేం ఓవర్!" అని గట్టీగా అరిచి, ప్యాంటూ అలా పైకెత్తుకుని "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అంటూ నా చుట్టూ తిరగటం మొదలు పెట్టాడు....---------------------------Flashback - 1---------------------------అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు..మా క్లాసు ఎదురుగా ఒకటో తరగతి పిల్లలు "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అని ఆడుకుంటున్నారు. నేను చూస్తుంది ఆ పిల్లలను కాదు..వాళ్ళను ఆడిస్తున్న మా సరస్వతి మిస్సును...సరస్వతి మిస్...మళయాళం అమ్మాయి.......నా ఫస్ట్ లవ్!సరస్వతి మిస్సు మాకు సోషల్ స్టడీస్ చెప్పేది..తన అందం తో నా చదువు సర్వనాశనం చెసింది..అందమే అనుకుంటే.. అందానికి మించిన తెలివితేటలు. ఎవ్వరూ, ఎప్పుడూ వినని విషయాలెన్నో మాకు చెప్పేది మా మిస్సు. "శ్రీలంక రాజధాని ఆఫ్ఘనిస్తాన్" అన్న మా సరస్వతి మిస్ మాటలు ఆ తరువాత ఎక్కడైన ఎవరైన రాసారేమో/చెప్పారేమో అని ఎంత వెతికినా లాభం లేకపొయ్యింది...మా మిస్సు కు నేనంటే మొదటి నుండి అదోకరకమైన ఇది..నన్ను అప్పుడప్పుడూ 'కుట్టా' అని పిలిచేది - 'కుట్టా' అంటే మళయాళం లో 'స్వీట్ బాయ్' అని అర్థం!చాలా సార్లు 'useless idiot' అని కూడా పిలిచేది - 'useless idiot' అంటే ఇంగ్లీషులో 'స్వీట్ బాయ్' అని అర్థం!మా సరస్వతి మిస్ అపురూప సౌందర్యాన్ని చూసే అప్పట్లో ఇంగ్లీషు పెద్దలు ఒక సామెత కనుగొన్నారు - "Man is a social animal" అని......అంటే - "మా సోషల్ మిస్సుని ప్రేమించని మనిషి జంతువుతో సమానం" అని అర్థం...అటువంటి మా సరస్వతి మిస్సు..సరస్వతి మిస్సెస్ గా మారబోతోందని తెలిసింది. మా స్కూల్లో అందరికీ కార్డులు పంచింది. నా బుగ్గ నిమిరి "పెళ్ళికి తప్పకుండా రావాలి కుట్టా" అని తట్టా బుట్టా సర్దుకుని నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది....ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా దగ్గు మందు తాగి దేవదాసు కామిక్స్ చదువుతూ గడిపేసాను..ఆ మరుసటి రోజే నిర్ణయించుకున్నాను - ఇంకోసారి ప్రేమలో పడకూడదని!-------------------------------దినకర్ గాడు పడ్డాడు - నా చుట్టూ తిరుగుతున్న హుషారు లో ఒక గులక రాయి మీద జారి..వాడీని పైకి లేపి "పద లోపలకు వెళ్దాం..లోపల నీ విపరీత చేష్టలు కాస్త అదుపులో పెట్టుకో" అని హెచ్చరించి లోపలకు తీసుకెళ్ళాను....మేము ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ 30, 40 మంది మల్లమ్మలు కిల కిల, గల గల అని మళయాళం లో నవ్వుతూ కనిపించారు...అంత మంది అందమైన అమ్మాయిలను చూడగానే దినకర్ గాడికి (లేని) మతి పోయింది.."ఆహా..నా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఇన్నాళ్ళకు దొరికింది రా..నా చార్మ్ తో ఇక్కడుండే అమ్మాయిలందరిని మెస్మరైజ్ చేసి అవతల పారేస్తాను....చూస్తూ ఉండు...ఇంకో రెండు మూడూ గంటల్లో ఈ మల్లమ్మలందరూ 'దినకర్ నాకు కావాలి...దినకర్ నా వాడూ అని ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటారు" అని...రెండు క్షణాలాగి "సరే పద...ఇద్దరం కలిసి విజృంభిద్దాం" అని నా చెయ్యి పట్టుకు లాగాడు...."ఇద్దరం కలిసా??...వద్దురా...'గౌతం జోగి, దినకర్ జోగి రాసుకుంటే కిలో బూడిద రాలిందంట'....ఎందుకు రిస్కు..ఎవరికి వాళ్ళు ప్రయత్నిద్దాం..ఏమంటావు?" అన్నాను...వాడు ఏమీ అనకముందే పూర్ణిమ నన్ను గుర్తు పట్టి నా దగ్గరకు వచ్చింది.."హై గౌతం..రండి..ఎవరో ఫ్రెండును కూడా తీసుకొచ్చినట్టున్నారు...గుడ్..సరిగ్గా టైం కు వచ్చారు..ఇప్పుడే ముగ్గుల పోటీలు జరగబోతున్నాయి..వెళ్ళీ మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి - అక్కడ" అని ఒక చిన్న టేబులుముందు నుంచున్న ముగ్గురు అమ్మాయిల వైపు చూపించింది...నేను థ్యాంక్స్ చెప్పేలోపు దినకర్ గాడు నన్ను లాక్కుని ఆ అమ్మాయిల దగ్గరకు తీసుకెళ్ళాడు.."హెలో..వెల్కం. మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి..ఇంకో పది నిముషాల్లో పోటీ మొదలవ్వబోతోంది" అంది ఆ ముగ్గురిలోకి కాస్త పొడుగ్గా ఉన్న మల్లమ్మ..దినకర్ గాడు వెంటనే తిరుపతి లోని ప్రతాప్ థియేటర్ ఎదురుగుండా కొన్న 67 రూపాయల సన్ గ్లాసెస్ తన జేబులోంచి తీసి పెట్టుకుని - "నా పేరు దినకర్" అన్నాడు.."స్పెలింగ్ చెబుతారా?" అడిగిందా అమ్మాయి.."Dinakarqwxyz" అన్నాడు మావాడు.."అదేంటండి??"దినకర్ గాడు టేబుల్ మీదకెక్కి కూర్చుని, తన సన్ గ్లాసెస్ ముక్కు మీదకు జార్చి - "నా పేరులో చివరి ఐదక్షరాలు సైలెంట్.....ఒక వేళ మీకు కష్టమనిపిస్తే 'The nakar' అని రాసుకోండి" అన్నాడు..ఆ అమ్మాయి ఏదో రాసుకుని - "మీ మెయిల్ ID ఇస్తారా..వచ్చే నెలలో మా మళయాళీ సంఘం వాళ్ళు ఒక నాటకం వెయ్యబోతున్నారు..మీకు ఇన్విటేషన్ పంపుతాము" అంది.."తప్పకుండా...నా మెయిల్ ID - dinakarmarella-AT-gmail.com....-DOT-password - lakshmikrishna.....నా ఫోన్ నంబరు - 9845749659""ఫోన్ నంబరు అవసరం లేదండి""పర్లేదు ఉంచండి....నంబరు మీ దగ్గరుంటే ఒకటి..నా దగ్గరుంటే ఒకటీనా.." అని తన మొబైల్ బయటకు తీసి "ఇంతకీ మీ నంబరు చెప్పలేదు" అన్నాడు..."అవును" అని సమధానమిచ్చింది ఆ అమ్మాయి..జరిగేదంతా నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను...ఇంత నిశ్శబ్దంగా అప్పుడెప్పుడో నా కెమిస్ట్రీ ల్యాబు పరీక్షలో మా ప్రొఫెసర్ నన్ను Viva క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఉన్నా.....మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు...ఆ అమ్మాయి తన దగ్గరున్న లిస్టులో ఏవో టిక్కు మార్కులు పెట్టి మా ఇద్దరినీ ఇంకో నలుగురు అమ్మాయిలున్న టీములో వేసింది..."అదిగో మీ టీము వాళ్ళు అక్కడున్నారు" అని రూము చివర్న పూల బుట్ట పక్కనున్న అమ్మాయిల వైపు చూపించింది..దినకర్ గాడు ఆ రెజిస్ట్రేషన్ అమ్మాయితో ఏదో మాట్లాడుతుండంగానే నేను మా టీమ్మేట్స్ వైపు వెళ్ళాను...ఆ నలుగురిలో ఒకమ్మాయికి బుగ్గ మీద సొట్టుంది...."నన్ను మీ టీం లో వేసారండి" అన్నాను ఆ అమ్మాయిని చూసి..."అలాగా...నా పేరు స్మిత...మీరు?" అని చెయ్యి ముందుకు చాచింది.."గౌతం" అని షేక్ హ్యాండు ఇచ్చాను...షేక్ హ్యాండు ఇస్తుంటే...నా జీవితాన్ని షేక్ చేసి నాకు హ్యాండిచ్చిన 'సునయన ' గుర్తొచ్చింది.. ------------------------------- Flashback - 2-------------------------------సునయన - నా రెండో ఫస్ట్ లవ్...ట్రివేండ్రం అమ్మాయి...ఇంజనీరింగ్ లో నా క్లాస్మేట్...నేనెప్పుడు కనిపించినా నవ్వుతూ షేక్ హ్యాండిచ్చేది..తను నా చెయ్యి తాకినప్పుడల్లా నా జీవితం బృందావన్ గార్డెన్స్ లాగా అందంగా కనిపించేది....సునయన ను కలిసిన మొదటి నెలలోనే నిర్ణయించుకున్నాను....'జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సునయన నే చేసుకోవాలి'* అని....(*కుదరక పొతే వేరే అమ్మయిని చేసుకుందాం)మా మూడవ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవానికి మేము గ్రూప్ డాన్సు చెయ్యాలని అనుకున్నాము..ఏ పాటకు చెయ్యాలనే విషయం మీద మొదలయ్యింది గొడవ..."మనము చెసేది శాస్త్రీయ నృత్యం కాబట్టి 'నిన్నా కుట్టేసినాది, మొన్న కుట్టేసినాది గండు చీమా ' అనే తెలుగు పాటకు చేద్దాము " అని నేను...."కాదు 'ఓణం, ఆణో, పెణ్ కుట్టి' అనే మళయాళం పాటకు చేద్దామని సునయన.....చివరకు మా గ్రూపు లోని మిగతావాళ్ళంతా మళయాళం పాటకే ఓటేసారు. ఆ అవమానాన్ని నేను భరించలేకపోయాను. సునయన తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను...తను ఎప్పుడో గిఫ్టుగా నాకిచ్చిన నట్రాజ్ పెన్సిల్, ఇమామి కోల్డ్ క్రీం తనకు తిరిగిచ్చేసి - వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసాను..(ఇందాక flashback మొదలవ్వకముందు సునయన నాకు హ్యాండిచ్చిందని అన్నాను కద....సారీ....నేనే హ్యాండిచ్చాను)---------------------------------------"ఎలా ఉంది ముగ్గు" అంది స్మిత...ఉలిక్కిపడి, ఉలిక్కిలేచి...ముగ్గు చూసాను.."నన్ను పెళ్ళి చేసుకుంటావా స్మిత" అనటానికి మళయాళం లో ఏమంటారో అని ఆలోచిస్తుండగా దినకర్ గాడు నా దగ్గరకు వచ్చి "రేయ్..నేనిప్పుడే వస్తాను..అలా వాకిట్లోకెళ్ళీ కుందేలునో, జింకనో పట్టి తీసుకురావాలి" అన్నాడు..."ఏమి మాట్లాడుతున్నావు రా...ఒక్క ముక్కా అర్థమవ్వట్లేదు" అన్నాను.."అదిగో అక్కడ మంచి నీళ్ళు తాగుతోందే అమ్మాయి..ఆ అమ్మయిని పేరు అడిగాను రా..'పట్టీ పో' అంది...సీత రాముడిని అడిగినట్టు జింకనో, కుందేలునో పట్టి తీసుకు రమ్మందేమొనని వెళ్తున్నా" అన్నాడు..."రేయ్ మూర్ఖుడా...'పట్టి' అంటే మళయాళం లో 'కుక్క' అని అర్థం రా" "అవునా??""అవును...'పట్టి పో' అంటే......'నీ కుక్క బుధ్ధులు ఇంకెక్కడైన చూపించుకో పో...ఆ 67 రూపాయల చల్లద్దాలు తీసెయ్యి..గౌతం దగ్గర తీసుకున్న cd లు, లీటర్ పెట్రోలు ఎప్పుడూ తిరిగిస్తావు బే....TVS-50 చెట్టుకు కట్టెయ్యటమేంట్రా గులాబి రంగు జీన్సు ప్యాంటు వెధవా" అని అర్థం" అన్నాను...."పేరు అడిగినందుకు పేరగ్రాఫ్ పొడుగు తిట్టు తిట్టిందా పట్టి మొహం ది"....అని కాస్సేపు బాధపడి...."ఏంటోరా..ఈ రోజు అంతా రివర్సే...నువ్వు ఆ ముగ్గు గొడవలో ఉండగా 14 మంది అమ్మాయిలను ట్రై చేసాను...ఒక్కరూ వర్క్ అవుట్ అవ్వలేదు.........సరే..నీ పరిస్థితి ఏంటి" అనడిగాడు..."నాతోరా...Mrs.గౌతం ను పరిచయం చేస్తాను" అని స్మిత దగ్గరకు తీసుకెళ్ళాను..స్మిత కూడా తన ఫ్రెండు ఎవరినో నాకు పరిచయం చెయ్యటానికి తీసుకొచ్చింది.."దిసీజ్ గౌతం...ముగ్గుల పోటీలో మా టీం లో ఉన్నాడు..మళయాళం బాగా మాట్లాడతాడు తెలుసా" అంది.."అవునా...ఎలా నేర్చుకున్నారు మళయాళం?" అడిగింది ఆ అమ్మాయి.."నేను TV లో ఎప్పుడూ మళయాళం చానెల్స్ చూస్తూ ఉంటానండి..అలా పట్టేసాను..నా డ్రస్సు చూసారా....మొన్న శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో చూసిన మళయాళం సినిమాలోని కాస్ట్యూంసే ఈ నా ఈ డ్రస్సుకు ఇన్స్పిరేషన్" అన్నాను...దినకర్ గాడు నా భుజం మీద గిల్లి - "శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో మనము చూసిన సినిమాలో అసలు హీరో, హీరోయిన్లు కాస్ట్యూంసే వేసుకోలేదు కద రా" అన్నాడు...స్మిత, స్మిత స్నేహితురాలు నా వైపు అస్సహ్యంగా చూసి - "ఓణం, ఆణో, పెణ్ కుట్టి" అని ఛీదరించుకును వెళ్ళిపోయారు.. కళ్ళలో నీళ్ళతో దినకర్ గాడి వైపు చూసాను.."సారీ రా...తప్పు చేసాను...క్షమించు" అన్నాడు..."తప్పు నీది కాదులేరా...ఎందుకో చెబుతా విను....నీ Orkut ప్రోఫయిల్ లో, పర్సనల్ డీటెయిల్స్ లో 'Ideal Match' పక్కన 'India vs Pakistan in sharjah' అని రాసుకున్న ఏబ్రాసి వెధవవి నువ్వు..ఇది తెలిసి కూడా నాకిష్టమైన అమ్మాయిని పరిచయం చెయ్యటానికి తీసుకెళ్ళానే....నాది రా తప్పు....నా పేరు మార్చుకోవాలి రా 'దినకర్ ' అని....." అని ఏడ్చేసాను..ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళే సరికి నీల్ విజయ్ గాడు అందరికీ పార్టీ ఇచ్చాడు...నా మూడో ఫస్ట్ లవ్ ఫెయిలైనందుకు...ఆ తరువాత మా వాళ్ళు కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు.....ఇదిగో..మొదటి బహుమతి పొందిన ముగ్గు -
Posted at 09:15AM Nov 05, 2008 by Shashidhar Bussa in General Comments[0]
-->
Tuesday Nov 04, 2008

వివాహ భోజనంబు - వింతైన వంటకంబు
ఆగస్టు 24, 2008 – ఎవ్వరూ నమ్మని కొన్ని విచిత్రాలు జరిగాయి- హైదరాబాదు లో హుస్సేన్ సాగర్ లోని చెత్తా చెదారం తీసేసి త్రాగు నీటి కొలను గా మార్చారు.- లాస్ ఏంజెలస్ లో స్టీవన్ స్పీల్బర్గ్ తన తదుపరి చిత్రం బిజీ ఆర్టిస్టు నందమూరి తారకరత్న తో తీస్తున్నట్టు ప్రకటించాడు.- బెంగళూరులో ఉంటున్న నేను ఇకపై రోజూ ఇంట్లో వంట చేసుకుని తినాలని నిర్ణయించుకున్నాను."ఇకనుండి రోజూ ఇంట్లోనే వంట చేద్దాం" అనుకునే ప్రతి బ్రహ్మచారి లాగనే నేను కూడా 'Food World' కు వెళ్ళి పది కిలోలు బంగాళా దుంపలు, పది కిలోలు ఉల్లిపాయలు, పది కిలోలు గట్రాలు, ఇంకో పది కిలోలు వగైరాలు తీసుకుని కొట్టు బయటకు అడుగుపెట్టాను....రెండు ఆటోలు మాట్లాడాను – రెండూ కూరగాయలకే...నేను డ్రైవర్ పక్కన కూర్చున్నా.......కాస్త దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ తన జేబు లోంచి ఒక కార్డు తీసి – "సార్...ఇది మా తమ్ముడు సూర్య ప్రకాష్ ఫోన్ నంబరు....పెళ్ళికి కావలసిన షామియాన, వంట సామాను అద్దెకు ఇస్తాడు....వాడి దగ్గరే తీసుకోండి సార్ " అన్నాడు......."ఎవరి పెళ్ళికి?" అడిగాను నేను....."ఈ కూరగాయలన్నీ......""ఈ రోజు నుండి నేను రూము లో వంట చేసుకోవటం మొదలు పెడుతున్నా.....అందుకే నెలకు సరిపడ కూరగాయలన్నీ తెచుకున్నా....ఇవ్వాళ సాంబార్ వండుకుంటున్నా"ఆటో వాడు రెండు నిముషాలు మౌనంగా ఆటో నడిపి.....ఇంకో కార్డు జేబులోంచి తీసి.... "సార్…ఇది శంకర్ నారాయణ అని మా ఎదురింటాయన నంబరు...ఆయన పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో మిగిలిపోయిన కూరగాయలు కొని వాటిని హోటళ్ళకు అమ్ముతుంటాడు....మీరు 'ఇక వంట నా వల్ల కాదు' అనుకున్నప్పుడు ఫోను చేస్తే మీ ఇంటికొచ్చి కూరలన్నీ కలెక్టు చేసుకుని వెళ్తాడు...................మీరు ఇవ్వాళ సాయంకాలానికి ఫోను చేస్తారని చెప్పనా సార్ ఆయనతో?" అన్నాడుఆటో వాడు నన్ను ఇంతగా అవమానించి నందుకు ఆటో ఆపి...కిందకు దిగి…రెండు చేతులూ పైకి లేపి… "ఈ రోజునుండి నా వంట నేను చేసుకు తింటాను...లేక పోతే ఉపవాసముంటాను.....ఏ మెరీ అఖండ్ ప్రతిగ్యా హై " అని భీష్మ ప్రతిఙ చేసాను.....ఆకాశం నల్ల బడింది....ఉరుములు, మెరుపులు, వర్షం...మబ్బుల సందులోంచి దేవతలు పూలు చల్లారు.........దేవతల వేషం వేసిన ఎక్స్ట్రాలకు, వర్షం కురిపించిన ఫైర్ ఇంజన్లకు డబ్బులిచ్చి పంపించేసాక…..ఇల్లు చేరుకున్నాను….మొదటి సారి వంట చేయ్యబోతున్నాను కదా....మా అమ్మకు చెబితే సంతోషిస్తుందని ఇంటికి ఫోను చేసా........సరే ఎలాగూ ఫోన్ చేసాను కదా అని ఒక చిన్న డౌటు క్లియర్ చేసుకుందామనుకున్నా......"అమ్మా...సాంబార్ ఏలా చేస్తారు?""ఎవరు?" అడిగింది అమ్మ"ఎవరైనా ఎలా చేస్తారు?""ఎందుకు?""అబ్బా.......నేను ఈరోజు ఇంట్లో వంట చేస్తున్నానమ్మా......అందుకే అడిగా...ఎలా చేస్తారో చెప్పు ""అవునా........నువ్వు వంట చేసుకుంటున్నావా........" అని అంతులేని ఆనందంతో మా అమ్మమ్మను పిలిచి.. "అమ్మా.....గౌతం వంట చేసుకుంటున్నాడంట....." అని అరిచి చెప్పింది.........మా అమ్మమ్మ చేస్తున్న పని వదిలేసి....మా పనిమనిషి కి, మా పక్కింటి డ్రిల్ మాస్టారి పెళ్ళానికి.. "నా మనవడు వంటచేసుకుంటున్నాడంట " అని మా అమ్మకన్నా గట్టిగా అరిచి చెప్పింది.....దానికి మా పనిమనిషి "అయ్యయ్యో.....వంటలు చేసుకుని బతుకుతున్నాడామ్మా" అని అడిగింది...నాకిక్కడ ఫోను బిల్లుతో పాటు BP కూడా పెరుగుతోంది......."అమ్మా....సాంబార్ ఎలా చెయ్యాలో చెబుతావా లేదా " అన్నాను...మా అమ్మ "సరే....ముందు కూరగాయలన్నీ తరిగి.......పెళ్ళి చేసుకోరా" అంది..."ఎంటి సాంబార్ చెయ్యాలంటే పెళ్ళి చేసుకోవాలా?" "కాదు....పెళ్ళి చేసుకుంటే ఈ కష్టాలన్నీ ఉండవని............కూరగాయలు తరిగి...ఒక పక్కన పెట్టుకో"ఎవరో కాలింగ్ బెల్లు కొట్టారు....మా అమ్మ – "కాలింగ్ బెల్లు తరువాత కొట్టొచ్చు....ముందు కూరగాయలు తరుగు""నేను కాదమ్మా....ఎవరో వచ్చినట్టున్నారు......నేను తరువాత ఫోను చేస్తా " అని ఫోను పెట్టేసాను.. సాంబార్ లో పుడక లాగా వీడెవడని తలుపు తెరిచాను.."ఎవరు కావాలండి?""సార్.. గౌతం అంటే...""నేనే...చెప్పండి ""సార్....శ్రీనివాసులు మీకు నా కార్డు ఇచ్చానన్నాడు....అదే ఆటో డ్రైవరు.............నా పేరు శంకర్ నారాయణ సార్" "ఆ.....చెప్పండి""ఎన్ని కూరగాయలున్నయో చూపిస్తే ఒక రేటు అనుకోవచ్చు ""ఆ అవసరం లేదండి...ఏమైనా విషయముంటే నేనే మీకు ఫోను చేస్తాను" "నేను కింద మీ సెక్యూరిటీ వాడితో మాట్లాడుతూ ఉంటాను....ఫోను చెయ్యండి సార్....రెక్కలు కట్టుకుని లిఫ్టులో వచ్చేస్తాను" అని వెళ్ళిపోయాడు....మా అమ్మ కాని, అమ్మమ్మ కాని వంట చెయ్యటం మొదలు పెట్టాగానే TV ఆన్ చేస్తారు....TV లో వచ్చేది వింటూ చెయ్యకపోతే ఆ రుచి రాదు...అందుకే నేను కూడా TV ఆన్ చేసాను...ఏదో తెలుగు చానెల్...."ప్రపంచంలో మొట్టమొదటి live వంటల కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం.....గత కొద్ది వారాలుగా మాకు వచ్చిన ఉత్తరాల్లో చాలా మంది అడిగిన కోరిక ఒకటుంది....బ్రహ్మచారులు ఇళ్ళల్లో వండుకునే వంటకాలేమైనా చూపించండి అని....అందుకే ఈ వారం మనము బెంగళూరు విజయనగర్ లోని 'హనుమాన్ అపార్ట్మెంట్స్' కు వెళ్తున్నాము...."నేను ఇవ్వాళ పొద్దున మా గేటు బయట పడుకునే నక్క తోక పచ్చడి పచ్చడి గా తొక్కినట్టున్నాను....లేక పొతే ఇంత అదృష్టమా??....నేను వంట చెయ్యాలనుకున్న రోజే ఎవరో బ్యాచిలర్స్ ఇంట్లో వంట కార్యక్రమం live.....బ్రహ్మచారుల కొంప కాబట్టి ఆడవాళ్ళెవ్వరూ వచ్చి "ముందు పాత్రలు కడుక్కోవాలి..ఇల్లు శుభ్రంగా వూడవాలి...jeans కనీసం రెండు సంవత్సరాలకు ఒక సారి ఉతుక్కోవాలి " లాంటి టిప్స్ ఇవ్వరు......నేను బంగాళా దుంపలు తరుగుతూ TV చూస్తున్నాను.."హెలో..ఎవరండీ లోపల??" అని తలుపు కొడుతూ అడిగింది మైకు పట్టుకున్నావిడ...లోపలినుండి ఎవరో తలుపు సగం తెరిచి చెయ్యి మాత్రం బయట పెట్టారు..."హెలో...మేము NAA TV నుండి వస్తున్నామండి....మాకు ఉత్తరం వచ్చింది ఈ అడ్రసు నుండి... నిమ్మల వెంకట రావు గారు ఉన్నారా?"చెయ్యి లోపలకు తీసుకుని తలకాయ బయటకు పెట్టాడు ఆ లోపలున్నతను....."ఒహ్..మీరు నిజంగా TV వాళ్ళా....రెండు నిముషాలు ఉండండి" అని తలుపు వేసేసాడు....ఆ మైకు పట్టుకున్నావిడ మొహం లో చిరునవ్వు ఏ మాత్రం చెరిగిపోకుండా కెమేరా వైపు చూసి.."చూస్తున్నారుగా....తమ ఇంట్లో చెయ్యబోయే వంటలు చూపించటానికి వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో....ఏమి వండబోతున్నారో తెలుసుకోబొయ్యేముందు మీరు తీసుకోండి ఒక చిన్న BREAK"....నేను కూరగాయలు తరగటం నుండి చిన్న బ్రేకు తీసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి....అందులో నీళ్ళు పోసి స్టవ్ వెలిగించాను...................నీళ్ళు ఘమ ఘమ లాడిపొతున్నాయి.......ఇంక సాంబార్ సూపర్ హిట్టే.....స్టవ్ మీద నీళ్ళున్నాయి..తరిగిన కూరలున్నాయి..ఆ తరువాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుండగా మా అన్నయ్య ఫోనొచ్చింది..." రేయ్...నేను ఇవ్వాళ సాంబార్ వండుతున్నాను....తరిగిన కూరగాయలు నీళ్ళు ఉడికాక వెయ్యాలా....నీళ్ళు ఉడకకముందే వెయ్యాలా?" అని అడిగాను.."నీళ్ళు 'ఉడకట'మేంట్రా....'మరగటం' అనాలి....వంట తరువాత నేర్చుకుందువు గాని...ముందు తెలుగు నేర్చుకో"...."సరే...ఫోనెందుకు చేసావో చెప్పు"...."కాస్త తలనొప్పిగా వుంటే ఏ మాత్రలు వాడాలి అని అడుగుదామని ఫోన్ చేసా".."ఓ...తలనొప్పా....మెన్నీమధ్య ఎక్కడో చదివాను..'లంఖణం పరమౌషధం' అని...కాబట్టి..నువ్వు వెంటనే మెడికల్ షాపుకెళ్ళి మూడు లంఖణాలు తెచ్చుకో...పూటకొకటి వేసుకో...........భోజనం తరువాత" అన్నాను....మా వాడు సమాధానమేమి ఇవ్వకుండా ఫోను పెట్టేసాడు..సరే...అన్నింటికీ నల-భీములే ఉన్నారనుకుని........మరిగే (ఉడికే) నీళ్ళలో తరిగిన కూరగాయలు వేసా.....సాంబార్ పొడి పాకెట్టు కట్ చేసి ఒక దోసిట్లో సరిపడా పొడి వేసా.....ఉప్పేసా...కారమేసా...దాహంగా ఉంటే కొన్ని నీళ్ళు తాగి...కొన్ని గిన్నెలో పోసా.. చక్కెర డబ్బా మీదకెక్కుతున్న చీమను నలిపేసా..(భలే...నాకు తెలియకుండానే ఒక డబ్బింగు సినిమా పాట రాసేసా)ఇంతలో TV లో బ్రేకు అయిపొయ్యింది...నేను గబ గబా గిన్నె మీద మూత తీసి TV ముందు కూర్చున్నా.....బ్రేకు టైములో ఆ ఇంట్లోని బ్యాచిలర్సంతా నిద్ర లేచి...తలకు నీళ్ళు రాసుకుని, తలలు దువ్వుకుని తయారయ్యినట్టున్నారు....ఆ మైకావిడ కెమేరా వైపు చూసి "Welcome back.....ముందుగా ఈనాటి మన హోస్ట్లు ఏమి చేస్తుంటారో తెలుసుకుందాం....చెప్పండి వెంకట్రావు గారు...ఏమి చేస్తుంటారు మీరు?" అంది...వెంకట్రావు సమధానమిచ్చే లోపు అతని పక్కనున్న లుంగి కట్టుకున్న బ్యాచిలర్ మైకు లాక్కుని "రాత్రుళ్ళు బాత్రూము లైటు ఆఫ్ చెయ్యకుండా పడుకుంటుంటాడు....నేను ఉతుక్కున్న సాక్సులు, డ్రాయర్లు, ఇస్త్రీ చేసుకున్న చొక్కాలూ వేసుకెళ్తుంటాడు.....మీరు TV లో కనిపించినప్పుడు 'మాంచి కసక్కు' అని అంటుంటాడు.........." అని ఇంకా ఏదో చెప్పబొయ్యేలోపు వెంకట్రావు వాడి నోరు మూసేసి...."ఆవిడ అడిగింది ఏ ఉద్యోగం చేస్తుంటానని రా...........మేడం..మనము నేరుగా విషయానికి వచ్చేద్దాం" అన్నాడు....."ఓకే ఐతే...మా ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏ వంటకం చెయ్యబోతున్నారు""ప్రతి బ్రహ్మచారి గర్వంగా...తలెత్తుకుని...రోజూ వండుకునే వంటకమే..........Noodles"....అన్నాడు..."ఓ...గ్రేట్....మొదలెడదామా""ఒక్క నిముషమండీ....రెండు మూడు వస్తువులు తెప్పించాలి..." అని.......ఇందాకటి నుండి తన close-up తీయమని కెమెరా మెన్ ను బతిమాలుతున్న బ్యాచిలర్ దగ్గరకు వెళ్ళి..."రేయ్ ప్రసాదు..నువ్వు వెంటనే బయటకెళ్ళి...టొమేటోలూ, ఉల్లిపాయాలు, ఉప్పు, కారం, జింజర్-గార్లిక్ పేస్టు తీసుకురా.......అలాగే వచ్చేప్పుడు ఒక నూడుల్స్ పాకెట్టు, గ్యాస్ సిలిండర్ కూడా తీసుకురా" అని చెప్పి పంపించేసాడు...మైకావిడ మళ్ళీ కెమేరా వైపు తిరిగి...."ప్రసాద్ గారు వస్తువులు తెచ్చేలోపు మనము తీసుకుందాం....ఒక చిన్న...” అని వెంకట్రావు, లుంగీ బ్యాచిలర్ వైపు చూసింది....వెంటనే ముగ్గురూ కలిసి.....కెమెరా కు బొటన వేలు చూపించి..... "BREAK" అన్నారు.... ఇందాక వెంకట్రావు జింజర్-గార్లిక్ పేస్టు అన్నది గుర్తొచ్చి వెంటనే నేను గిన్నె మీద నుండి మూత తీసేసి రెండు చెంచాలు జింజర్-గార్లిక్ పేస్టు వేసాను....కాసేపు గరిటె తో తిప్పుతూ ఉండగా ఎవరో కాలింగు బెల్లు కొట్టారు..వెళ్ళి తలుపు తీసాను...మా ఇంటి ఓనరు..."ఏంటి సార్""మీ ఇంట్లోంచి ఏదో రబ్బరు కాలిన వాసనొస్తోందయ్యా...అందుకే ఇలా వచ్చా" అని....హిడింబాసురుడి లాగా..."రబ్బరు వాసన.....రబ్బరు వాసన" అని అరుస్తూ వంటింటి వైపు పరిగెట్టాడు....మర్డరు వెపన్ ను పసిగట్టిన పోలీసు కుక్క లాగ.....నా సాంబారు గిన్నె ముందు నిలబడ్డాడు మా ఓనరు....."ఏంటయ్యా...వంట చేస్తున్నావా...ముందే చెప్పుంటే టిప్స్ ఏమైనా ఇచ్చేవాడిని కదా.....ఏమి వండుతున్నావ్?" అని అడిగాడు..."సాంబార్ సార్""అలాగా...ఉండు మా ఆవిడ వంటలోకి వాడే మసాలా పొడి తెస్తాను" అని పరిగెత్తుకెళ్ళి ఏదో పొడి తీసుకొచ్చి నేను ఎంత వద్దంటున్నా వినకుండా నా సాంబారు లోకి వేసాడు....రెండు నిముషాలు....నేను మా ఓనర్ని, మా ఓనరు సాంబారు గిన్నెని చూస్తూ గడిపాము...ఇప్పుడు నిజంగా వస్తోంది సార్....రబ్బరు కాలిన వాసన...ఏం పొడి సార్ అది?" అని ఆడిగాను..."ఏదైతే నీకెందుకు, ఓ ఇరవై నిముషాల పాటు మూత పెట్టుంచు...ఆ తరువాత చూడు.....మహత్తరంగా ఉంటుంది" అని వెళ్ళిపొయ్యాడు...TV లో బ్రేకు అయిపొయ్యింది....మైకావిడ, వెంకట్రావు, లుంగి బ్రహ్మచారి..ముగ్గురూ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు....ఇంతలో ఆ ప్రసాదు చేతిలో ప్లాస్టిక్ సంచితో రూములోకి వచ్చాడు..."ఏంట్రా...అన్ని వస్తువులు తెమ్మని పంపితే చిన్న సంచితో దిగావు??""కిందకెళ్ళి చూస్తే బండి పంక్చర్ అయ్యింది రా.....ఆటోలో అన్ని తీసుకురావటం ఎందుకు ఖర్చు అని.....మురుగదాస్ హోటలుకెళ్ళి నూడుల్స్ పార్సెల్ తెచ్చాను.."............ఆ గదిలో అందరు నిశ్శబ్దంగా నుంచున్నారు.....వెంకట్రావు ఉండబట్టలేక....."నూడుల్స్ పార్సెల్ తేవటమేంట్రా........ఇక్కడ TV వాళ్ళు ఉన్నారని తెలుసు గా.." అన్నాడు కోపంగా..."తెలుసు రా....వాళ్ళకు కూడా రెండు ప్లేట్లు పార్సెల్ తెచ్చాను" అని కవర్లోంచి మూడు పొట్లాలు తీసి చూపించాడు....ఇదంతా చూస్తున్న మైకావిడ అతని వైపు చూసి..."నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ".....అంది"మీకెలా తెలిసింది మేడం?? మా ఇంట్లో వాళ్ళు, నా ఫ్రెండ్సు నన్ను ప్రసాద్ అని పిలుస్తారు కాని...నా అసలు పేరు దినకర్....ఎలా చెప్పగలిగారు మీరు" అనడిగాడు...నాకు చిరాకేసి TV కట్టేసాను.......వంటింట్లోకి వెళ్ళాను....ఇందాక రబ్బరు కాలిన వాసన ఇప్పుడు ఎలక చచ్చిన వాసన గా మారింది.....భయం భయంగా గిన్నె మీద ఉన్న మూత తెరిచాను......నలుపు, పసుపుపచ్చ, నీలం రంగులు కలిపితే వచ్చే రంగులో ఉంది ఆ గిన్నె లోని పదార్థం......ముక్కుకి కర్చీఫు కట్టుకుని అదంతా ఒక చిన్న టిఫిన్ డబ్బాలోకి వేసి మా ఓనర్ వాళ్ళ ఆవిడకిచ్చాను........ఆ వంటకం పేరు 'కాలా పథ్థర్' అని....మా ఓనరు గాడికి తినిపించమని చెప్పి వచ్చాను........ఫోను తీసుకుని శంకర్ నారాయణ నంబరు డయల్ చేసాను......"హెలో....ఆ...పైకి రండి....ఒక రేటు అనుకుందాం".........వంట చెయ్యటం అస్సలు రాకుండానే.....టన్నులకొద్దీ కూరగాయలు కొని....ఆవేశం తో వంట మొదలుపెట్టి....చేతికి దొరికినవన్నీ వేసి వండి....మధ్యలో మా ఓనరు లాంటి cookక ను వేలు పెట్టనిస్తే.....ఇలాగే ఉంటుంది...............రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేసినట్టు!
Posted by Sreenivas Singarapu in
Wednesday Oct 29, 2008

దూలదర్శన్
కాలాలు నాలుగు - ఎండా కాలం, వానా కాలం, చలి కాలం, పొయ్యే కాలం. మొదటి మూడు కాలాలు సంవత్సరం లొ ఏ ఏ నెలల్లో వస్తాయో చెప్పే వీలుంది. కానీ ఆ నాలుగోది ఎప్పుడు ఏ రూపం లొ వస్తుందో చెప్పలేము. నాకు ఆ పొయ్యేకాలం గత వారం వచ్చింది.మా ఆఫీసు లొ తెలుగు వాళ్ళము ఒక ఇరవై మంది దాకా ఉంటాము...వాళ్ళలో పట్టాభి ఒకడు. పొయిన వారం వాడి పుట్టిన రొజు. ఆఫీసు కాంటీను లో అందరికి జ్యూసు ఇప్పించాడు. ఎవరి కక్కుర్తి కొద్దీ వాళ్ళు బాగనే తాగారు. ఈ లోపు విద్యా అనే అమ్మాయి ఎదో చీటీల గేం మొదలు పెట్టింది.ప్రతి ఒక్కరు టేబుల్ మీద ఉన్న చీటీలు తియ్యాలి. చీటీలొ ఏమి రాసుంటే ఆ పని చెయ్యలి (ఔను..మా దిక్కుమాలిన ఆఫీసులొ పుట్టిన రోజు పండగలకి ఇలాంటి ఆటలే ఆడుతారు).మొదటి చీటీ విద్యానే తీసింది.."వరుసగా రెండు జ్యూసులు తాగాలి" అని చదివింది. నాకు అనుమానమే. చీటీలు రాసింది అది. లోపల ఏమున్నా, నొటికొచ్చింది చదివి, తేరగా రెండు జ్యుసులు తాగేసింది. ఆ తరువాత చాలా మంది చీటీలు తీసారు. 'పాట పాడాలి ', 'నాలుక తో ముక్కును తాకాలి ' లాంటి మెదడుకు పదును పెట్టే చేష్టలెన్నో చేసారు.చివరగా పట్టాభి చీటీ తీసాడు. అందులో "నీకు ఇష్టమైన TV ప్రోగ్రాం గురించి చెప్పాలి" అని ఉంది.వాడు "నా ఫేవరెట్ ప్రోగ్రాం 'ప్రగతి పథం'" అన్నాడు."ఏ ఛానెల్ లొ వస్తుంది?" ఎవరో అడిగారు."దూరదర్శన్ - తెలుగు" అన్నాడు పట్టాభి.అంతే....అంత వరకు కోలాహలంగా ఉన్న ఆఫీసు కాంటీన్ ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారింది. ఒక్కొక్కరుగా కాంటీన్ నుంచి వెళ్ళిపొయ్యారు. వెళ్ళేటప్పుడు ఎవ్వరూ పట్టాభి గాడిని విష్ కూడా చెయ్యలేదు.చాలా బాధేసింది..పట్టాభి ని చూసి. చాల కోపమొచ్చింది..వెళ్ళిపోతున్న జనాలను చూసి.పట్టాభి గాడు "నాకు AIDS ఉంది" అన్నా కూడా ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు కాదేమో.అస్సలు వాడు చేసిన తప్పేంటో నాకు అర్థం కాలా. దూరదర్శన్ చూడటం అంత పెద్ద నేరమా?వాడితొ ఎవ్వరూ మాట్లాడట్లేదు. వాడితొ కలిసి భొజనం చెయ్యటం మానేసారు. ఇదివరకు వాడిపక్కన సీట్ ఉన్న వాళ్ళంతా ప్లేసు మార్చేసారు.రెండు రోజుల తరువాత - బాగా బధ్ధకంగా ఉంటే ఆఫీసుకు సెలవు పెట్టాను.TV ఛానళ్ళు మారుస్తూ దూరదర్శన్ దగ్గర ఆగాను. పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం.(నేను మొదట్లొ చెప్పినట్టు 'పొయ్యేకాలం' ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకే ఒక్క సూచన ఉంది 'పొయ్యేకాలం' రాకను పసిగట్ట టానికి - "దూరదర్శన్ చూడాలి" అనే ఆలొచన రావటం).సరే.. ఎలాగూ ఛానెల్ మార్చను కదా అని, దూరదర్శన్ పెట్టి, రిమోట్ అవతల పారెసి...ఈసీ చైర్ లొ జారబడి కూర్చున్నా.శాంతి స్వరూప్, విజయ దుర్గ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడో చూసాను వీళ్ళని. ఇద్దరూ బాగా లావయ్యారు..శాంతి స్వరూప్ లో ఎదో తేడా కనిపిస్తోంది. ఎంటబ్బా అని అలోచిస్తుండగా....శాంతి స్వరూప్ తన విగ్గు తీసి, బట్ట తల గోక్కొని, మళ్ళీ పెట్టుకున్నాడు. ఒహ్..ఇదా విషయం.విజయ దుర్గ ఎదో ఉత్తరం చదువుతోంది.గుర్తు పట్టెసా..ఇది 'జాబులు జవాబులు ' కార్యక్రమం!కానీ వాళ్ళిద్దరి వెనకాల ఉన్న నీలం రంగు గుడ్డ మీద 'జాబు - జవాబు ' అని రాసుంది. పేరు మార్చారెమో అనుకున్న. ఒక అరగంట పాటు చూసాక అర్థమయ్యింది. ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది వాళ్ళకు - అది కూడా ఫిబ్రవరి నెలలొ దూరదర్శన్ కేంద్రం ఆఫీసుకు వచ్చిన కరెంటు బిల్లు. విజయ దుర్గ ఆ బిల్లులొ ఉన్న ప్రతి అక్షరం చదివి "చాలా మంచి సూచన్లిచ్చారండి" అంది. తరువాత శాంతి స్వరూప్ "కరెంటు" మీద ఒక కవిత చెప్పాడు. అరగంట తరువాత జాబు జవాబు ముగిసింది. శాంతి స్వరూప్ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు. విజయ దుర్గ ముందు టేబుల్ తెచ్చి వేసారు. కెమేరా వైపు చూసి "తరువాయి కార్యక్రమం..కొత్త సినిమా పాటలు" అని అనౌన్సు చెసింది.ఆహా..కొత్త పాటలా... అరగంట పాటు ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకున్న.ప్రోగ్రాం మొదలయ్యింది..'ఈ పిల్లకు పెళ్ళవుతుందా', 'పులి బిడ్డ ', 'జగన్మోహిని ' - ఒక్కొక్క సినిమాలొంచి రెండు రెండు పాటలేసారు.అప్పుడర్థమయ్యింది...'కొత్త సినిమ పాటలు ' అంటే - తెలుగు సినిమా మొదలయ్యిన కొత్తలో పాటలని.మెల్లగా నాకు చెమట పడుతొంది. పైకి చూసాను. ఫాను తిరుగుతూనే ఉంది. మరి చెమట ఎలా పడుతొందా అని ఆలొచిస్తుండగా...మళ్ళీ విజయ దుర్గ వచ్చింది. "ఇప్పుదు డిసెంబరు నెలలొ జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తారు" అంది.ప్రోగ్రాం మొదలయ్యింది. అసెంబ్లీలో ఎవ్వరూ లేరు. నలుగురు ఆడవాళ్ళు కసువు ఊడుస్తున్నారు. ఒక అరగంటయ్యింది...వెరే ఎవరొ వచ్చి సీట్లన్నీ తుడిచి, వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళారు. తరువాత MLA లు ఒక్కరొక్కరుగా రావటం మొదలు పెట్టారు.నాకేమి అర్థం కావటంలా...అసెంబ్లీ సమావెశాలంటే MLA లు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి, వాళ్ళ దినచర్య అంతా చూపిస్తారా... నాలొ కొద్దిగా భయం మొదలయ్యింది. దూరదర్శన్ ను ఎంత తక్కువగా అంచనా వేసానో ఇప్పుడు అర్థమయ్యింది.టైము చూసాను....ప్రోగ్రాం మొదలయ్యి చాలా సేపయ్యింది. ఇంకో పది నిముషాలలొ సమావెశాలు ముగిసిపొతాయి అనుకుంటుండగా విజయ దుర్గ మళ్ళీ వచ్చింది. "అనివార్య కారణాలవల్ల సమావెశాలు పూర్తిగా చూపించలేక పొయాము. ఈ రోజు రాత్రి యెనిమిదింటికి కార్యక్రమం మొదటి నుంచి మళ్ళీ ప్రసారం చేస్తాము" అంది.అమ్మో... త్వరగా బయటపడాలి అని పైకి లేవబొయ్యాను...నా వల్ల కాలేదు. వీపు పట్టెసింది..అస్సలు కదలలేక పొయ్యాను. సరే ఛానెల్ మారుద్దాం అని రిమోట్ కోసం చూసాను."దరిద్రుడు బాత్రూము లోకి పోతే... శనిగాడు బయట నుంచి గొళ్ళెం పెట్టేసాడంట"ఇందాక వెరే ఛానెల్ ఎదీ చూడను అన్న ఆవేశం లొ రిమోట్ ఎక్కడో పారెసాను. ఇప్పుడు అది దొరకట్లేదు. కుర్చీలోంచి లేవటానికి విశ్వప్రయత్నం చేసాను..లాభం లేదు. చెసేదేమీ లేక అలా ఆ క్షోభను అనుభవిస్తూ కూర్చున్నాను...నేను చిన్నప్పుడు చదువుకున్నాను - "1926 లొ జె.ఎల్.బైర్డ్ టెలివిజన్ కనుగొన్నాడు" అని. మహానుభావుడు ఎక్కడున్నడో....భవిష్యత్తు లొ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారమౌతాయి అని తెలిసుంటే TV ని పురిట్లొనే చంపేసేవాడు. వార్తలు మొదలయ్యాయి. నేనెలాగూ నాశనం అయ్యాను...కనీసం మిగతా ప్రపంచమన్నా బగుందో లెదో తెలుసుకుందాం....శాంతి స్వరూప్ - "నమస్కారం...ఈ రోజు వార్తల్లోని ముఖ్యంశాలు చదివేముందు....'వార్త ' అనే మాట మీద చిన్ని కవిత"పది నిముషాల పాటు కవితలు, చాటువుల తరువాత వార్తలు అయిపొయ్యయి.దుర్గమ్మ తల్లి మళ్ళీ వచ్చి "తరువాయి కార్యక్రమం...డాక్టర్ సలహాలు...live program...మీరు డైల్ చెయ్యవలసిన నెంబరు - 040 23454261. ఈ రోజు అంశం....మూత్ర సంబంధిత వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు"శాంతి స్వరూప్ తయారయ్యాడు.శాంతి స్వరూప్ - "ప్రేక్షకులకు నమస్కారం..మా డాక్టర్ గారు ఇంకా రాలేదు. మీరు ఈలోపు ఫొన్ చెస్తే..నా తొ మాట్లాడొచ్చు"ఇంతలొ ఫొన్ మోగింది..వీళ్ళకు ప్రేక్షకులు ఫొన్ చేసి చాల కాలమైంది అనుకుంటా...ఫొన్ మోగంగానె స్టూడియో లొ ఉన్న అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒక చిచ్చు బుడ్డి కూడా కాల్చారు.శాంతి స్వరూప్ ఫొన్ తీసుకుని - "హలో"కాలర్ - నమస్కారం సార్...నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నాను.శాంతి స్వరూప్ - శ్రీనివాస్ గారూ...మీ TV వాల్యూం కాస్త తగ్గించుకొవాలికాలర్ - లేదు సార్...మా ఇంట్లో ఎవ్వరూ దూరదర్షన్ చూడరు. మీరు భయపడకండి.శాంతి స్వరూప్ - సరే చెప్పండికాలర్ - నిన్న నాకు జ్వరంగా ఉంటే డాక్టర్ కు చూపించాను సార్శాంతి స్వరూప్ - అలాగా...మరి డాక్టర్ ఏమన్నాడుకాలర్ - జ్వరమొచ్చిందన్నాడు శాంతి స్వరూప్ - మరి ఇంకేంటి సమస్య...శ్రీనివాస్ గారు, మన స్టూడియో కు డాక్టార్ గారు రావటానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఈలోపు నెనొక కవిత చదువుతాను....వినాలి తమరు.నా రూం లొ కరెంటు పొయ్యింది..ఆహా...కరెంటు పొయ్యినందుకు నేను ఇంతగా ఎప్పుడూ ఆనందించలేదు. ఈ చీకటి నా జీవితంలొకి మళ్ళీ వెలుగు తీసుకొచ్చింది....దెబ్బతగిలినప్పుడు Dettol రాసుకుంటే మొదటి 10 సెకండ్లు మంటేసి తరువాత చల్లగా ఉంటుంది. ఆ 10 సెకండ్ల మంట ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందొ దూరదర్శన్ చూసాక తెలిసింది.
Posted by Sreenivas

మల్లెపూలూ - మసాలా వడ
ఈ క్రింద ఉన్నదంతా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగ వ్రాయబడింది..ఇందులోని ఏ పాత్రా కల్పితము కాదు..ఇంకో విషయం...మన తెలుగు సినిమాల లాగానే పైన ఉన్న టైటిల్ కూ కింద రాసిన దానికీ ఏ మాత్రమూ సంబంధం లేదు...ఏ పేరు తోచక పెట్టింది మాత్రమేతలుపు కొట్టిన చప్పు డయ్యింది. వెళ్ళి చూస్తే ఎదురుగా 'రెండు రెళ్ళు ఆరు ' నిలబడుంది.నేను - హలో..బాగున్నావారెండు రెళ్ళు ఆరు - నెను బాగానే ఉన్నాను. నీ విషయం చెప్పు. వారం దాటిపొయ్యినా కలవటానికి రాకపొతే నెనే వచ్చా..ఏంటి సంగతులు?నేను - మంచి పని చేసావు. నిజానికి నెనే నీ దగ్గరకు వద్దామనుకున్నాఇంతలొ మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. తెరిచి చూస్తే 'ఆఫీసు పని ' కనిపించింది. బట్టలన్నీ చిరిగి పొయ్యి, చింపిరి తలతో చాలా అస్సహ్యంగా ఉందినేను - నువ్వా..మళ్ళీ ఎందుకొచ్చావ్? దయచేసి నన్ను కాస్సేపు వదిలెయ్యి..చాలా రోజుల తరువాత నా ఫ్రెండుతొ ఓ గంట సేపు సరదాగ గడపాలనుకుంటున్నా. ఐనా నిన్ను ఆఫీసు లో రోజూ కలుస్తూనే ఉన్నాను గా..ఇంటికెందుకొచ్చినట్టు?ఆఫీసు పని - నీ బాసు పంపించాడు..నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త ఆనందంగా ఉండటం చూసినట్టున్నాడు. ఎక్కడో మూలకు పడి ఉన్న నన్ను వెతికి నీ కోసం పంపాడు. నాకు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, తల దువ్వి, పౌడర్ రాసి పంపాలట.నేను 'రెండు రెళ్ళు ఆరు ' వైపు చూసాను.రెండు రెళ్ళు ఆరు - పరవాలేదు. నెను వెయిట్ చెస్తాను. దాని సంగతి చూడు'ఆఫీసు పని ' కి గంట సేపు స్నానం చేయించినా జిడ్డు వదల్లేదు. నా ఓపిక నశించింది..చేయించిన స్నానం చాలనుకుని, చాలీ చాలని బట్టలు తొడిగి దానిని పంపించేసాను..హమ్మయ్య...ఇప్పుడు ఎవ్వరొచ్చినా సరే 'రెండు రెళ్ళు ఆరు ' తో కనీసం ఓ అర గంటైన గడపాలి..తలుపు చప్పుడయ్యింది. వెళ్ళి కిటికీ లోంచి చూసాను.బయట 'నిద్ర ' నుంచుని ఉంది. నేను తలుపు తెరవలా.ఇంతవరకు తలుపు మెల్లగా తట్టిన 'నిద్ర ' ఇప్పుడు దబ దబా బాదుతోంది...సరే దీని సంగతేంటొ చూద్దామని తలుపు తెరిచానేను - నువ్వు మామూలుగ ఆఫీసు లో ఉన్నప్పుడు కదా వస్తావు...ఇలా ఇంటికొచ్చావేంటి?నిద్ర - మాష్టారూ..మనము కలిసి రెండు రోజులౌతోంది. నా వెనకాలే 'జ్వరం' కాచుకుని ఉంది..దానిని ఇంకాస్త వెయిట్ చెయ్యమని నచ్చజెప్పి నేను వచ్చాను..ఈ రోజైన కనీసం నాలుగు గంటలు నాతో గడపక పోతే రెపు పొద్దున్నే ఆ 'జ్వరం' నిన్ను వచ్చి కలుస్తుందంట..మూడు నాలుగు రోజులక్కానీ నిన్ను వదలదు మరి...ఆలోచించుకో.'నిద్ర ' మాటల్లో నిజం లేక పోలేదు. ఏమి చెయ్యాలో తోచక 'రెండు రెళ్ళు ఆరు ' దగ్గరకు వెళ్ళానునేను - ఏమీ అనుకోకు..ఓ రెండు రోజులు గా 'నిద్ర ' ను బాగా నిర్లక్ష్యం చేసాను..ఈ రోజు కూడా దానిని పలకరించక పోతే ఇబ్బందులొస్తాయి. మనము రేపు తప్పకుండా కలుద్దాం..ఎమంటావు?'రెండు రెళ్ళు ఆరు ' - అలాగే కానీ..నీ ఇష్టం. రేపు ఎన్నింటికి రమ్మంటావు?నేను - నేనే వస్తాను. రెపు నేను చెయ్యవలసిన పని ఒకటుంది..వారం రోజులుగా మా బాబాయి కొడుకు 'తీరిక ' కనిపించట్లేదు. వాడిని ఎలాగైన వెతికి పట్టుకోవాలి..'తీరిక ' దొరకంగానే నేనే నిన్ను వచ్చి కలుస్తాను.ఎంతో బాధతో 'రెండు రెళ్ళు ఆరు ' వెళ్ళిపొయ్యింది. నేను అబద్దం చెప్పానని దానికీ తెలుసు. మా బాబాయి కొడుకు పేరు 'తీరిక ' కాదు ..'సాకు '. పైగ వాడెప్పుడూ నాతోటే ఉంటాడు....కాని ఏమి చెయ్యను?? రేపు ఆఫీసుకి వెళ్ళిన వెంటనే నిన్న నేను స్నానం చేయించిన 'ఆఫీసు పని 'ని నా బాసు గాడు బురద లో దొర్లించి మళ్ళీ నా దగ్గరకు పంపుతాడు. ఈ సారి దానిని రెడీ చెయ్యటానికి ఎంత సేపు పడుతుందో? అందుకే అలా అబద్దం ఆడాల్సి వచ్చింది.కారణం అదొక్కటే కాదు...నన్ను కలవటానికి వచ్చే విజిటర్స్ లో ఇంకో వెధవ ఉన్నాడు. వాడి పేరు 'సోమరితనం'. వీడు నాతో ఉన్నంతసేపు ఎవ్వరు వచ్చినా నేను తలుపు తియ్యను. ఎవ్వరి తోను మాట్లాడను..వీడు నన్ను వదిలి నా బాసు గాడి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా వాడి దగ్గర ఉన్న 'ఆఫీసు పని ' నా దగ్గరకు వస్తూ ఉంటుంది.సరే, ఏదోలాగా మసి పూసి మారేడికాయ చేసి వీళ్ళందరిని వదిలించుకుని 'రెండు రెళ్ళు ఆరు ' తో మీటింగు ఏర్పాటు చేసుకుంటే...నా మంచం కింద దాక్కుని ఉన్న 'దిగులు ' బయటకు వస్తుంది. ఇదో రాక్షసి. అస్సలు ఇది ఎలా వస్తుందో తెలియదు..ఏమి కావాలో అడగదు..ఎవరు పంపిస్తే వచ్చిందో చెప్పదు. ఉన్నంతసేపు ప్రాణం మాత్రం తోడేస్తుంది.ఇంత మంది శత్రువుల తో పోరాడితే తప్ప 'రెండు రెళ్ళు ఆరు 'ని కలవలేక పోతున్నా.వచ్చే వారంలో నైనా 'రెండు రెళ్ళు ఆరు 'ని కాస్త త్వరగా కలిసి..దానితో కాస్త ఎక్కువ సేపు గడపాలి..చూద్దాం..
Posted at 11:03AM Oct 29, 2008 by Shashidhar Bussa in General Comments[0]
-->
Friday Oct 24, 2008

ఓ సిగరెట్టు కథ
వచ్చే జన్మలో నేను మనిషిగా పుట్టకపోవచ్చునేమో కానీ, దున్నపోతుగా మాత్రం పుట్టను. ఎందుకంటే, నేనూ సిగరెట్టు తాగాను! గిరీశం శాపనార్థం నాకు తగలదు!ఖగపతి అమృతము తేగాభుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్పొగచెట్టై జన్మించెనుపొగతాగని వాడు దున్నపోతై పుట్టున్సరే, నా మొదటి సిగరెట్టు కాలేజీ చదువు ముగించి, పూనా లో ఉద్యోగం చూస్తున్న రోజుల్లో మొదలయింది. అప్పట్లో పూనా లో "అల్కా" అని ఓ సినిమా థియేటరు. సెలవు రోజుల్లో అక్కడ చెప్పనవసరమే లేదు. రంగు రంగుల సీతాకోక చిలుకల మయం. అయితే అపశృతి ఏమంటే, అమ్మాయిలందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోనూ, వాళ్ళ కాలేజీ మేట్స్ తోనూ సినిమాలకు రావడం. నాలాంటి జిడ్డు ముఖాలను అస్సలు పట్టించుకోకపోవటం. ఎలా...? వాళ్ళ దృష్టిలో పట్టం ఎలా? ఆ దురాశే నా మొదటి సిగరెట్టు కు హేతువయింది. నేనూ నా మిత్ర బృందం ఓ మూల నిలబడి స్టవిలుగా ఒకే సిగరెట్టు పంచుకుని తాగేము. అమ్మాయిలు రాలే కానీ దగ్గొచ్చింది. ఆ తర్వాత నోరంతా చేదు వాసన..అప్పుడప్పుడూ మా ఆశ చావక మా మిత్ర బృందం సభ్యులు, అలా ఒకే సిగరెట్ పంచుకుని మా వంతు ప్రయత్నాలు చేశాము. అయితే,ఒకే సిగరెట్ అలా పంచుకుని తాగడం వల్ల డబ్బు ఆదా చేయగలిగామని కాస్త ఆత్మ తృప్తి మాత్రం మిగిలింది.మా లో బడ్జెట్ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఫలించలేదు.ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నా వ్యర్థ ప్రయత్నాలను చూసి, ఎగతాళి చేయడం, నలుగురు చూసి నవ్వుకోవడం వంటివి అక్కడి అమ్మాయిలు చేసినట్టు కనబడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి, నాకు ఆఫీసులో ఇద్దరు ముంబయి అమ్మాయిలు పరిచయమయ్యారు. ఆ అమ్మాయిలు నా టీమ్ లో పనిచేయడానికి ముంబయి IIT నుండీ వచ్చిన వాళ్ళు. (అన్నట్టు నేనో భయంకరమైన మొహమాటం గాణ్ణి లెండి) వాళ్ళతో కాస్త పరిచయం అయిన తర్వాత అర్థమయింది, వాళ్ళ కు అబ్బాయిలు చేసే కోతి చేస్టల గురించి చాలా వీజీగా తెలిసిపోతుంది అని. (అప్పటికి నేనింకా "యూత్" గానే ఉన్నాను). వాళ్ళకో సారి నేను చేసిన వ్యర్థ ప్రయత్నాల గురించి చెప్పేను. పడీ పడీ నవ్వారు. ఆ అమ్మాయిల్లో ఓ అమ్మాయి నన్ను చాలా లైక్ చేసేది(ట). ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భర్తలతో, పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. నాకు మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ....ఓర్కుట్లో!సరే..సిగరెట్టు వెనుక నా ఉద్దేశ్యం సిగరెట్టు కాదు కనుక, నాకు అది అలవాటవలేదు. పూనాలోనే కొన్ని రోజులలా గడిచిన తర్వాత, ఉద్యోగం మారాను. ఆ కొత్త ఉద్యోగం లో, ఆఫీసులో ఓ అందమైన మరాఠీ రెసెప్షనిస్టు. తొలి చూపులోనే ప్రేమ మొదలయింది. ఏవేవో ఊహలు, ఎక్కడికో వెళ్ళిపొయే వాణ్ణి. ఆ ఊహల్లో ఓ ఊహ, ఎప్పుడో ఓ సిగరెట్టు తాగినా అది తనకు ద్రోహమే కదా అనేది ఒకటి. ఆ విధంగా సిగరెట్టు ఆలోచనలే దూరమయాయ్. కొసమెరుపు ఏమంటే, ఆ అమ్మాయి స్టయిల్ గా సిగరెట్ తాగే అప్పటి నా కొలీగ్ ని ఒకణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది!అప్పుడలా వదిలేసిన సిగరెట్టు పొగ, మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత రాజుకుంది. ఈ సారీ అమ్మాయే, అందులోనూ పూనా అమ్మాయే కారణం. ఇక్కడ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను పని చేసిన మొదటి ప్రాజెక్ట్ విజయ వంతంగా నాశనం అవడంతో, నన్ను వేరే టీమ్ లోకి మార్చారు. ఆ టీములో చేరిన తర్వాత మొదటి మీటింగు. నా ఎదురుగా ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. నా జీవితంలో ఓ క్షణం నాకు కాకుండా పోయింది. అంత అందమైన కళ్ళు నేనంతవరకు హీరోవిను భానుప్రియ లో మాత్రమే చూసాను.ఆ అమ్మాయి నా పక్క సీట్ అవడంతో మాటలు కలిపేను. ఆ అమ్మాయి తెలివయిందేమో, మొదటి రోజే చెప్పేసింది, తనకు పెళ్ళయినట్టుగా. సిగరెట్ మళ్ళీ రాజుకుందిక్కడ!అదో పెద్ద బాధాకరమైన విషయం గా మారలేదు. అయితే ఎప్పుడైనా (ఏ రెండు మూడు నెలలకో ఓ సారి) అలా ఓ సిగరెట్ తాగాలనిపిస్తే, తాగడంలో ఇబ్బంది లేదు. ఎలాగూ అది నాకు అలవాటు కాదు కాబట్టి.ఓ ఏడాది క్రితం మాత్రం, సిగరెట్ నాకో చిన్న అనుభూతిని మిగిల్చింది. ఉద్యోగ రీత్యా, ఇండోనెషియా వెళ్ళాను ఆన్సైట్ కి. అక్కడ మా (కంపనీ) డ్రయివర్ మాకు బాగా నచ్చేడు. తన పేరు "ఉన్ తుంగ్". అంటే, వాళ్ళ భాషలో "అదృష్టం". అతను చాలా పేద వాడు. భారతీయులంటే చాలా అభిమానం తనకు. తను స్వయంగా షారుఖ్ ఖాన్ కి పంఖా. షారుఖ్ ఖాన్ సినిమాలు అక్కడ వాళ్ళ భాషలో అనువదించినవి సినిమా హాళ్ళలో విడువకుండా చూస్తాడట తను. అక్కడ కంపనీ రూల్స్ ప్రకారం మాకు ఆఫీసు టైములో తప్ప మిగతా సమయాల్లో కారు వాడుకునే అవకాశం లేదు. అయితే, ఈ డ్రయివర్ మాత్రం మా కోసం, అప్పుడైనా వచ్చి సహాయం చేసే వాడు. మేమూ తనకు సహాయం చేసే వాళ్ళం. అక్కడ నుండీ తిరిగి వస్తూ, తనకు ఓ బహుమతిగా ఓ మొబయిల్ ఫోన్ ఇచ్చేము. తనూ మాకు ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. అయితే పేదవాడు , పైగా చదువుకోని వాడు కదా..చివరకు అక్కడ వాళ్ళ దేశం లో తయారయే "బుదం గరం" అనే ఓ సిగరెట్ పాక్ ఇచ్చేడు మాకందరికీ. ఆ సిగరెట్ లో ఉన్న ప్రత్యేకత , కాస్త చక్కెర లా తియ్యగా ఉన్న టేస్ట్. ఆ చక్కెర తీపి, సిగరెట్ దా, ఆ పేదవాడి మనసులో మాపట్ల ఉన్న అభిమానానిదా? ఆ చిన్ని అనుభూతి మరువలేనిది.